వెజిటేరియన్ బాయ్ ఫ్రెండ్ తో డేటింగ్... మహిళ రియాక్షన్ ఇదే..!

Published : Mar 29, 2023, 12:14 PM ISTUpdated : Mar 29, 2023, 01:36 PM IST
  వెజిటేరియన్ బాయ్ ఫ్రెండ్ తో డేటింగ్... మహిళ రియాక్షన్ ఇదే..!

సారాంశం

అయితే అది కాస్త హ్యూమర్ గా చెప్పాలని అనుకుంది. కానీ  అదే బెడిసి కొట్టింది. ఆమె హ్యూమర్ నెటిజన్లకు పిచ్చి కోపం తెచ్చిపెట్టింది.

ఈ ప్రపంచంలో రెండు రకాల మనుషులు ఉంటారు.  ఒకరు నాన్ వెజిటేరియన్ ఎక్కువగా తింటారు. మరి కొందరు.... ప్యూర్ వెజిటేరియన్లు ఉంటారు. అయితే చాలా మంది నాన్ వెజ్ ప్రియులకు వెజ్ తినాలంటే పెద్దగా నచ్చదు. ముఖ్యంగా డేట్ కి వెళ్లినప్పుడు వెజ్ తినాలంటే కష్టంగా అనిపిస్తుంది. ఓ అమ్మాయికి ఇదే పరిస్థితి ఏర్పడింది. డేట్ కి వెళ్లాలని అనుకుంటే అబ్బాయి ప్యూర్ వెజిటేరియన్ అయ్యాడట. అబ్బాయి చాలా క్యూట్ గా ఉన్నాడని, ఆరు అడుగులు ఉన్నాడని.. అయితే.. అతను జైన్ అని తెలిసి బాగా డిస్సపాయింట్ అయ్యింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే అది కాస్త హ్యూమర్ గా చెప్పాలని అనుకుంది. కానీ  అదే బెడిసి కొట్టింది. ఆమె హ్యూమర్ నెటిజన్లకు పిచ్చి కోపం తెచ్చిపెట్టింది.

ముఖ్యంగా వెజిటేరియన్స్, జైన్స్ ఆమె పై తీవ్రంగా మండిపడుతున్నారు. నిజానికి నీకు అంత మంచి అబ్బాయి దొరికే అవకాశాన్ని కోల్పోయావని కొందరు.. వెజిటేరియన్స్ అయితే తప్పేంటి అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

 


ఆన్‌లైన్‌లో షేర్ చేసిన తర్వాత వీడియో 3 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. కామెంట్స్ లో ఆమెను అతి దారుణంగా ట్రోల్ చేస్తుండటం విశేషం. 
"మమ్మల్ని పరిగణనలోకి తీసుకోనందుకు ధన్యవాదాలు. గౌరవప్రదంగా, మాంసం తినే పురుషులు మీకు దొరుకుతారు. " అని ఒక నెటిజన్ కామెంట్ చేయడం విశేషం.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?