ప్లానింగ్ లేకపోవడం వల్లే లాక్ డౌన్: ప్రశాంత్ కిషోర్

By Sree sFirst Published Mar 25, 2020, 9:20 PM IST
Highlights

ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులను అంచనా వేయడంలో ప్రభుత్వం విఫలమైందని, అందువల్లే మూడు వారల సుదీర్ఘ కాలం పాటు లాక్ డౌన్ చేయవలిసి వచ్చిందని, ఇంతకంటే ముందే గనుక ప్రధాని మేల్కొని ఉంది ఉంటే... ఈ పరిస్థితి దాపురించేది కాదని అభిప్రాయపడ్డాడు. 

దేశంలో కరోనా వైరస్ మహమ్మారి విలయతాండవం చేస్తున్నవేళ ప్రధాని నరేంద్ర మోడీ భారతదేశాన్ని 21 రోజులపాటు లాక్ డౌన్ చేస్తున్నట్టు ప్రకటించాడు. ఇలా మోడీ ప్రకటించగానే కొందరేమో ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తుండగా కొందరేమో ఇంత ఆలస్యంగానా నిర్ణయం తీసుకునేది అని విమర్శిస్తున్నారు. 

ఇలా విమర్శించేవారు కోవలోకే వస్తారు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులను అంచనా వేయడంలో ప్రభుత్వం విఫలమైందని, అందువల్లే మూడు వారల సుదీర్ఘ కాలం పాటు లాక్ డౌన్ చేయవలిసి వచ్చిందని, ఇంతకంటే ముందే గనుక ప్రధాని మేల్కొని ఉంది ఉంటే... ఈ పరిస్థితి దాపురించేది కాదని అభిప్రాయపడ్డాడు. 

ట్విట్టర్ వేదికగా ఆయన ప్రధాని మోడీ నిర్ణయంపై విమర్శలు గుప్పించారు. దేశంలో లాక్ డౌన్ విధించడం కరెక్టే అయి ఉండవచ్చు కానీ 21 రోజులనేది చాలా ఎక్కువ సమయమని, నెలకొన్న పరిస్థితులను అంచనా వేయడంలో విఫలం చెందడం వల్ల చెల్లిస్తున్న భారీ మూల్యం ఇన్ని రోజుల లాక్ డౌన్ అని ఆయన అన్నారు. 

ఈ కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు సన్నద్ధత సరిగా లేదని, లాక్ డౌన్ కాలంలో పేదల పరిస్థితిని గురించి తీసుకుంటున్న చర్యలు గని సరి అయినా ప్రణాళికలతో లేకపోవడం వల్ల మున్ముందు కఠినమైన పరిస్థితులను ఎదుర్కోవలిసి వస్తుందని ఆయన అన్నారు.  

ఇకపోతే ప్రధాని మోడీ నేడు మాట్లాడుతూ... ప్రస్తుతం యావత్ దేశం అప్రమత్తంగా ఉండాల్సిన సమయం అన్నారు. బుధవారం వారణాసి ప్రజలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన ఆయన దేశ ప్రజలందరం కలిసి కరోనాను ఎదుర్కొందామని పిలుపునిచ్చారు.

ఇంటి గడపు దాటకుండానే కరోనాను తరిమికొడదామని.. వైరస్‌పై ప్రతి ఒక్కరు యుద్ధం చేయాలని ప్రధాని పిలుపునిచ్చారు. 21 రోజుల తర్వాత మనం విజయం సాధించబోతున్నామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Also Read:కరోనా డేంజర్ బెల్స్.. దేశం మొత్తం 21 రోజుల పాటు లాక్‌డౌన్ : మోడీ

వారణాసి ప్రజలు దేశానికి స్ఫూర్తిగా నిలవాలని మోడీ పిలుపునిచ్చారు. సోషల్ డిస్టెన్స్ మన అలవాటుగా మారాలన్న ఆయన మనందరి కేరాఫ్ ఇల్లే కావాలని సూచించారు. మహాభారత యుద్ధాన్నే 18 రోజుల్లో జయించామని.. 21 రోజుల్లో కరోనాను జయించలేమా అని ప్రధాని ప్రశ్నించారు.

ప్రపంచంలో కరోనా సోకిన వాళ్లలో లక్షమంది కోలుకున్నారని, దేశానికి మూడు వారాల డెడ్‌లైన్ ఉందని ప్రధాని మోడీ గుర్తుచేశారు. అదే సమయంలో ఆఫ్గనిస్తాన్‌లో ఉగ్రవాదుల దాడిని ఖండించిన ప్రధాని.. 27 మంది మృతులకు సంతాపం తెలిపారు. 

కరోనా కట్టడి చర్యల్లో భాగంగా మంగళవారం రాత్రి 12 గంటల నుంచి దేశం మొత్తం లాక్‌డౌన్‌లో ఉందన్నారు ప్రధాని నరేంద్రమోడీ. జనతా కర్ఫ్యూను పాటించి ప్రజలు ప్రభుత్వానికి సహకరించారని ప్రధాని మోడీ ప్రశంసించారు.

Also Read:దేశంలో కరోనా కేసుల సంఖ్య 566: రాష్ట్రాల వారీగా తాజా లెక్కలు ఇవీ...

ఇల్లు విడిచి బయటకు రావడం పూర్తిగా నిషేధమని, ఒక రకంగా చెప్పాలంటే జనతా కర్ఫ్యూని మించిన విధంగా ఉంటుందని మోడీ తెలిపారు. ఇది ఒక రకంగా కర్ఫ్యూ తరహా వాతావరణమని, ప్రతి ఒక్కరిని చేతులేత్తి వేడుకుంటున్నా ఎవ్వరూ బయటకు రావొద్దన్నారు.

ప్రతి నగరం, ప్రతి ఊరు, ప్రతి వీధి లాక్‌డౌన్‌లో ఉంటాయని మోడీ చెప్పారు. 21 రోజులు ఇళ్లల్లో ఉండకపోతే.. పరిస్ధితి చేయిదాటుతుందని ప్రధాని వెల్లడించారు. ఈ 21 రోజుల బయటకు వెళ్లడమనేని మర్చిపోవాలని, ప్రతి ఒక్కరూ ఇళ్లకే పరిమితం కావాలని తెలిపారు. 

click me!