అయోధ్యలో రామమందిర నిర్మాణం: కీలక ఘట్టం పూర్తి

By narsimha lodeFirst Published Mar 25, 2020, 6:06 PM IST
Highlights

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్యలో రామ మందిర నిర్మాణంలో బుధవారం నాడు కీలక ఘట్టం చోటు చేసుకొంది.రాముని విగ్రహాన్ని రామ జన్మభూమి ప్రాంగణంలోకి తరలించారు.


అయోధ్య: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్యలో రామ మందిర నిర్మాణంలో బుధవారం నాడు కీలక ఘట్టం చోటు చేసుకొంది.రాముని విగ్రహాన్ని రామ జన్మభూమి ప్రాంగణంలోకి తరలించారు.

ఛైత్ర నవరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని బుధవారం నాడు తెల్లవారుజామున యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అయోధ్యలో  ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ స్వయంగా తన చేతుల మీదుగా రామజన్మభూమి ప్రాంగంణంలో మానస భవన్ లో ఏర్పాటు చేసిన తాత్కాలిక నిర్మాణంలోకి రాముని విగ్రహాన్ని తరలించారు.

9.5 కిలోల సింహాసనంపై రాముని విగ్రహాన్ని తాత్కాలిక నిర్మాణంలో ప్రతిష్టించారు. రాజ అయోధ్య విమలేంద్ర మోహన్ మిశ్రా ఈ సింహాసనాన్ని బహుమతిగా ఇచ్చారు. జైపూర్ కళాకారులు ఈ దీన్ని తయారు చేశారు.ఆలయ నిర్మాణానికి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ రూ. 11 లక్షలను విరాళంగా ఇచ్చారు.

కరోనా లాక్ డౌన్ కారణంగా స్థానికులు గుంపులుగా ఏర్పడకుండా జిల్లా యంత్రాంగం ముందు జాగ్రత్తలు తీసుకొంది. కొందరు వీహెచ్ పీ, ఆర్ఎస్ఎస్ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

click me!