ఈ ప్రయాణం మరుపురానిది.. ఆటో డ్రైవర్ పై ప్రశంసలు...!

By telugu news teamFirst Published Dec 2, 2022, 9:54 AM IST
Highlights

రాజీవ్ వాస్తవానికి ముంబై ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయాడు.అతను గమ్యాన్ని చేరుకోవడానికి మరో 60 నిమిషాలు పట్టింది. రామ్‌దేవ్ అతని అసహనాన్ని గమనించి అతనితో సంభాషణలో నిమగ్నమయ్యాడు.

ప్రయాణంలో ఒక్కోసారి మనకు కొందరు పరిచయం అవుతూ ఉంటారు. ఆ పరిచయం మనకు మరుపురానిది గుర్తుండిపోతుంది. ఓ వ్యక్తి విషయంలోనూ అదే జరిగింది. ఓ ఆటో డ్రైవర్ కారణంగా... తన ప్రయాణం చాలా మరుపు రానిదిగా మారిందంటూ సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఇంతకీ అతని కథేంటో ఓసారి చూద్దాం...

ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోను రాజీవ్ కృష్ణ అనే వినియోగదారు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. అందులో రామ్‌దేవ్ అనే 60 ఏళ్ల ఆటో రిక్షా డ్రైవర్ కనిపించాడు. రాజీవ్ వాస్తవానికి ముంబై ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయాడు.అతను గమ్యాన్ని చేరుకోవడానికి మరో 60 నిమిషాలు పట్టింది. రామ్‌దేవ్ అతని అసహనాన్ని గమనించి అతనితో సంభాషణలో నిమగ్నమయ్యాడు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rajiv Krishna (@krish_rajiv)

"నేను ముంబయిలోఫుల్ ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుపోయాను. ఆటోలో ప్రయాణిస్తుండగా.. ట్రాఫిక్ లో ఇరుక్కున్నాను అక్కడ గూగుల్ మ్యాప్స్ చివరి 3 కిలోమీటర్లను కవర్ చేయడానికి దాదాపు గంట సమయం పడుతుందని నాకు చెబుతోంది. నేను ఆటో దిగి  మిగిలిన మార్గంలో నడవాలని అనుకున్నాను. ఆ విషయాన్ని  డ్రైవర్  పసిగట్టాడు. నన్ను సంభాషణలో నిమగ్నం చేయడం ప్రారంభించాడు" అని రాజీవ్ క్యాప్షన్‌లో రాశాడు.

 

రాజీవ్‌ పర్యటించిన దేశాల గురించి రామ్‌దేవ్‌ను అడిగారు. ఐరోపా ఖండంలోని 44 దేశాల పేర్లు తనకు తెలుసని రామ్‌దేవ్ చెప్పడం రాజీవ్‌ను ఆశ్చర్యపరిచింది. అతను ఆ దేశాల పేర్లు,  కొన్ని ప్రముఖ దేశాల అధ్యక్షులు/ప్రధానుల పేర్లు కూడా చెప్పాడు. 

"మహారాష్ట్రలోని సింధుదుర్గ్‌కు చెందిన వ్యక్తి కావడంతో, అతను తన సొంత రాష్ట్రంలోని మొత్తం 35 జిల్లాల పేర్లు కూడా చెప్పేశాడు. అంతే కాదు, అతను గుజరాత్‌లోని మొత్తం 33 జిల్లాలకు, యుపిలోని మొత్తం 75 జిల్లాలకు పేర్లు కూడా చెప్పడం గమనార్హం.

ఇందులో అంత ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏముంది అని మీరు అనుకోవచ్చు. ఎందుకంటే... ఆ ఆటో డ్రైవర్ కనీసం చదువుకోలేదు. అతనిని చదివించే స్థోమత వారి కుటుంబంలో లేదు. కానీ.... సొంత తెలివితో ఆ విషయాలన్నీ తెలుసుకున్నాడు. తనకు తాను కొన్ని అక్షరాలు, అంకెలు నేర్చుకున్నాడు. కనీసం రోజులో మూడు పూటలా కూడా భోజనం చేయలేని కుటుంబం నుంచి వచ్చినా... తన సొంతంగా లోకగ్నానాన్ని తెలుసుకుంటున్నాడని రామ్ దేవ్ పై రాజీవ్ ప్రశంసలు కురిపించడం గమనార్హం.

click me!