తండ్రి ప్రేమ... కూతురి కోసం రూ.లక్షల జీతం వచ్చే ఉద్యోగం వదిలేసి...!

Published : Nov 21, 2022, 09:44 AM IST
తండ్రి ప్రేమ...  కూతురి కోసం రూ.లక్షల జీతం వచ్చే ఉద్యోగం వదిలేసి...!

సారాంశం

 కొందరు అతను కూతురిపై చూపించిన ప్రేమకు ప్రశంసలు కురిపిస్తుంటే.... మరి కొందరు మాత్రం... బుద్ది ఉన్నవారు ఎవరైనా ఉద్యోగం మానేస్తారా అంటూ విమర్శిస్తున్నారు.

పిల్లలపై పేరెంట్స్ అందరికీ ప్రేమ ఉంటుంది. తమ పిల్లలకు ఎలాంటి కష్టం  రాకుండా ఉండాలని చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. తమ పిల్లల భవిష్యత్తు బాగుండాలని అప్పటి నుంచి మరింత కష్టపడతారు. అయితే... ఓ వ్యక్తి మాత్రం కూతురు పుట్టిందని... రూ.లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని మానేశాడు. ఈ విషయం ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. కొందరు అతను కూతురిపై చూపించిన ప్రేమకు ప్రశంసలు కురిపిస్తుంటే.... మరి కొందరు మాత్రం... బుద్ది ఉన్నవారు ఎవరైనా ఉద్యోగం మానేస్తారా అంటూ విమర్శిస్తున్నారు. ఇంతకీ ఈ తండ్రి కథేంటో ఓసారి చూద్దాం...

 

అంకిత్ జోషి అనే వ్యక్తి ఐఐటీలో గ్రాడ్యుయేషన్ చేశాడు.  అతనికి ఇటీవల  కూతురు జన్మించింది. ఆ కూతురితో ఎక్కువ కాలం గడపాలని.. అతను ఎక్కువ రోజులు లీవ్ పెట్టాలి అని అనుకున్నాడు. లీవ్ అప్లై చేశాడు కూడా.  అయితే... ఎక్కువ రోజులు లీవ్ ఇవ్వడానికి కంపెనీ ఒప్పుకోకపోవడంతో....  ఏకంగా ఉద్యోగానికి రాజీనామా చేశాడు.  ఓ కంపెనీలో సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్న జోషి... తనకు రూ.లక్షల్లో జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలేశాడు.   'పాపతో జీవితం ఎంతో సంతోషంగా ఉంది. కొన్నాళ్లకి మళ్లీ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తా' అన్నాడు. అతడిపై నెట్టింట్లో ప్రశంసలు కురుస్తున్నాయి. అయితే.. కొందరు మాత్రం... ఉద్యోగం వదిలేయడం మాత్రం మంచి నిర్ణయం కాదని కొందరు విమర్శిస్తున్నారు. 

తాను ఉద్యోగం వదిలేయాలని నిర్ణయం తీసుకున్నప్పుడు... తమ చుట్టూ ఉన్నవారు విమర్శించారని... అయితే.... ఈ విషయంలో తనకు తన భార్య అండగా నిలిచిందని అతను చెప్పాడు. ఉద్యోగం మానేస్తే... డబ్బులు లేక ఇబ్బందులు పడతారని చాలా మంది హెచ్చరించారని... అయితే... ఈ విషయంలో తన భార్య అండగా నిలవడంతోనే.. తాను ఈ నిర్ణయం తీసుకోకలిగానని అతను చెప్పడం విశేషం.
 

PREV
click me!

Recommended Stories

Delhi dust storm: ఢిల్లీలో ఇసుక తుఫాను బీభత్సం | Massive Sandstorm Hits Delhi-NCR | Asianet Telugu
Vijay vs Udhayanidhi: తమిళనాడు అసెంబ్లీలో రచ్చసీఎం విజయ్ vs ఉదయనిధి | Asianet News Telugu