25 రాష్ట్రాల్లో..50మంది అమ్మాయిలను మోసం చేశాడు

By ramya neerukondaFirst Published Sep 17, 2018, 2:17 PM IST
Highlights

మ్యాట్రిమోనీ వెబ్ సైట్స్ లో మాత్రం తన ఫోటోలను చాలా అందంగా మార్ఫింగ్ చేసి పెడతాడు. అందంగా ఉన్న వేరే అబ్బాయిల ఫోటోలను తీసి వారి ఫేస్ దగ్గర తన ఫేస్ పెట్టి మార్ఫింగ్ చేస్తాడు. 

ఒకరు, కాదు ఇద్దరు కాదు.. ఏకంగా 50మంది అమ్మాయిలను మోసం చేశాడు  ఓ విశ్రాంత ఆర్మీ ఉద్యోగి. మ్యాట్రిమోనీ వెబ్ సైట్స్ ద్వారా అమ్మాయిలకు గాలం వేసి పెళ్లి పేరుతో మోసం చేశాడు. ఈ సంఘటన అహ్మదాబాద్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే...జులాయిన్ సిన్హా అలియాస్ సిద్ధార్థ్ మెహ్రా(42) గతంలో ఆర్మీ అధికారిగా పనిచేశాడు. ఇంగ్లీష్ భాష అదరగొడతాడు. కొంతకాలం క్రితం ఆయనకు మేజర్ యాక్సిడెంట్ జరిగింది. ఈ ప్రమాదంలో ఆయన రెండే కాళ్లు పోయాయి. అయితే.. డాక్టర్లు కాళ్లల్లో రాడ్లు వేశారు. వాటి సహాయంతో కొద్దిగా నడవగలడు.

అయితే.. మ్యాట్రిమోనీ వెబ్ సైట్స్ లో మాత్రం తన ఫోటోలను చాలా అందంగా మార్ఫింగ్ చేసి పెడతాడు. అందంగా ఉన్న వేరే అబ్బాయిల ఫోటోలను తీసి వారి ఫేస్ దగ్గర తన ఫేస్ పెట్టి మార్ఫింగ్ చేస్తాడు. వాటిని వెబ్ సైట్స్ లో పెడతాడు. తాను ప్రస్తుతం ఆర్మీ అధికారినని అందులో పెట్టడం విశేషం.

ఇక డబ్బున్న అమ్మాయిల వివరాలను మ్యాట్రిమోనీ వెబ్ సైట్ల ద్వారా సేకరించి.. వారికి పెళ్లి ప్రపోజల్ తీసుకువస్తాడు.  కొద్ది రోజులు ఫోన్ లో మాట్లాడి.. ఆ తర్వాత చిన్నగా అత్యవసరం పడిందంటూ వారి దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటాడు. మళ్లీ తిరిగి ఇవ్వకుండా కంటాక్ట్స్ మొత్తం కట్ చేసేస్తాడు. అలా ఇప్పటి వరకు 50మంది అమ్మాయిలను మోసం చేశాడు.

అలా మోసపోయిన ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా.. ఈ విషయాలన్నీ బయటపడ్డాయి. ప్రస్తుతం అతనిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

click me!