ప్రభుత్వం అనుమతిస్తే లీటర్ పెట్రోల్ రూ.35కే ఇస్తా: బాబా రాందేవ్

By Arun Kumar PFirst Published Sep 17, 2018, 1:01 PM IST
Highlights

దేశంలో నానాటికీ పెరిగిపోతోన్న పెట్రోల్ ధరలను అదుపు చేయకపోతే వచ్చే ఎన్నికల్లో ప్రధాని మోడీ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్

దేశంలో నానాటికీ పెరిగిపోతోన్న పెట్రోల్ ధరలను అదుపు చేయకపోతే వచ్చే ఎన్నికల్లో ప్రధాని మోడీ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్. ఒక జాతీయ ఛానెల్ నిర్వహించిన సదస్సులో ప్రస్తుత అంశాల గురించి ఆసక్తికరంగా ప్రసంగించారు.

పెట్రోలు ధరలు, రూపాయి విలువ క్షీణించడం, పన్నులు తదితర అంశాలు మోడీ ప్రభుత్వాన్ని ప్రమాదంలో పడేస్తున్నాయన్నారు. మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన చాలా విధానాలు బాగున్నాయని.. కానీ కొన్నింటిని సవరించాల్సి ఉందని.. వీటిలో అతిపెద్ద సమస్య ధరల పెరుగుదలేనని చెప్పారు.

ఒక వేళ ప్రభుత్వం తనకు అనుమతి ఇచ్చి.. పన్నుల్లో ఉపశమనం కల్పిస్తే.. లీటర్ పెట్రోల్, డీజిల్‌ను కేవలం రూ.35 నుంచి రూ.40కే అందిస్తానన్నారు. అదే విధంగా పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని.. వాటిని 28 శాతం శ్లాబ్ నుంచి తప్పించాలని రాందేవ్ సూచించారు.

click me!