ఎంపీ పాదాలు కడిగి.. ఆ నీరుతాగిన అభిమాని

Published : Sep 17, 2018, 02:37 PM ISTUpdated : Sep 19, 2018, 09:28 AM IST
ఎంపీ పాదాలు కడిగి.. ఆ నీరుతాగిన అభిమాని

సారాంశం

దికపై అంతా చూస్తుండగానే ఓ కార్యకర్త ఎంపీ పాదాలను పళ్లెంలో కడిగి.. ఆ నీటిని తాగాడు. అనంతరం తలపై కూడా చల్లుకున్నాడు.

ఎవరి మీదైనా అభిమానం ఉండొచ్చు కానీ.. మరీ ఇంతలా ఉండకూడదేమో. మనకన్నా పెద్దవారికి.. కాళ్లు కడిగారంటే.. వారంటే అభిమానం అనుకోవచ్చు. కానీ.. ఆ కడగిన నీటిని తాగితే.. ఇలానే చేశాడు ఓ వ్యక్తి. ఎంపీ కాళ్లు కడిగి ఆ నీటిని తాగాడు. ప్రస్తుతం ఈ ఘటనకుయ సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

పూర్తి వివరాల్లోకి వెళితే...జార్ఖండ్‌లో భాజపా ఎంపీ నిషికాంత్‌ దూబే నిన్న గొడ్డాలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. అయితే సభలో వేదికపై అంతా చూస్తుండగానే ఓ కార్యకర్త ఎంపీ పాదాలను పళ్లెంలో కడిగి.. ఆ నీటిని తాగాడు. అనంతరం తలపై కూడా చల్లుకున్నాడు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రజలు కార్యకర్త ప్రవర్తనను చూసి ఆశ్చర్యం వ్యక్తంచేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాలలో హల్‌చల్‌ చేస్తోంది. భాజపాలో వ్యక్తి పూజ పెరిగిపోతుందనడానికి ఈ ఘటనే నిదర్శనం అని ప్రతిపక్షాలు ఎంపీపై విమర్శలు ఎక్కుపెట్టాయి.

PREV
click me!

Recommended Stories

ఆకాష్, అనంత్ అంబానీలు తెలుసు... మరి ఎవరీ జై అన్మోల్ అంబానీ?
పౌర విమానయాన శాఖపై సభ్యుల ప్రశ్నలు | Minister Ram Mohan Naidu Strong Reply | Asianet News Telugu