సమోసా కోసం ఈ అమెరికన్ యూట్యూబర్ ఏం చేశాడో తెలుసా?

Published : May 27, 2023, 09:38 AM IST
సమోసా కోసం ఈ అమెరికన్ యూట్యూబర్ ఏం చేశాడో తెలుసా?

సారాంశం

మన దేశంలో సమోసాలు విరివిగా దొరుకుతాయి కాబట్టి మనకు పెద్దగా ఏమీ అనిపించదు కానీ, ఇతర దేశాల్లో వారికి ఇలాంటి ఫుడ్ దొరకడం కష్టమే. 

సమోసా అంటే ఇష్టపడనివారు ఎవరుంటారు చెప్పండి. మనలో చాలా మందికి సమోసాలు అంటే విపరీతమైన ఇష్టం ఉంటుంది. వేడి వేడిగా కరకరలాడే సమోసా, అందులో మెత్తగా ఆలూ కర్రీ లేదంటే కార్న్ నోట్లో పెట్టుకుంటే ఆహా.. ఆ కలిగే అనుభూతే వేరు. అందుకే వేడి వేడి సమోసా కనపడితే చాలు తినడానికి ముందుంటాం.

మన దేశంలో సమోసాలు విరివిగా దొరుకుతాయి కాబట్టి మనకు పెద్దగా ఏమీ అనిపించదు కానీ, ఇతర దేశాల్లో వారికి ఇలాంటి ఫుడ్ దొరకడం కష్టమే. అందుకే ఓ అమెరికన్ యూట్యూబర్ సమోసా కోసం బిహార్ రావాలని అనుకుంటున్నాడట. అమెరికాలో రెండు సమోసాలు రూ.600 అట. అంత పెట్టి సమోసా తినాలంటే బాధగా ఉందట. అదే, బిహార్ లో అయితే ఒక్క సమోసా కేవలం రూ.20. అందుకే బిహార్ వెళ్లాలి అనుకుంటున్నాను అని ఓ యూట్యూబర్ చెప్పడం విశేషం.


తన ఇన్‌స్టాగ్రామ్ బయోలో తనను తాను అమెరికన్ హిందీ యూట్యూబర్‌గా అభివర్ణించుకునే డ్రూ హిక్స్ యుఎస్‌లోని ఒక భారతీయ రెస్టారెంట్‌కు వెళ్లాడు. సమోసాలు ఆర్డర్ చేద్దామనుకున్నాడు కానీ రెండిటి ధర చూసి షాక్ అయ్యాడు. వెంటనే పక్కనే ఉన్న తన స్నేహితుడితో సమోసా తినడానికి బిహార్ వెళదామని చెప్పడం విశేషం.

డ్రూ రెస్టారెంట్ మెనూని కూడా చూపించాడు, అక్కడ 2 సమోసాల ధర $7.49, అంటే సుమారు రూ. 618. తన చిన్నప్పుడు సమోసా 5 రూపాయలు ఉండేదని చెప్పడం విశేషం. ఈ వీడియోకి ఇప్పటి వరకు 4 లక్షలకుపైగా వ్యూస్ రావడం విశేషం.  ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా, అందరూ అతనిని ఇండియా రండి బ్రో అని పిలుస్తున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్