కశ్మీర్‌లో థర్డ్ వేవ్? హాట్‌స్పాట్‌గా శ్రీనగర్.. పెరుగుతున్న కరోనా కేసులు

By telugu teamFirst Published Nov 11, 2021, 9:11 PM IST
Highlights

జమ్ము కశ్మీర్‌లో థర్డ్ వేవ్ ముంచుకొస్తున్నదనే ఆందోళనలు వస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ఇక్కడ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. తాజాగా ఒక్క రోజులోనే 165 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం కశ్మీర్ డివిజన్‌లో 968 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న శ్రీనగర్ కరోనా హాట్‌స్పాట్‌గా మారనుందనే ఆందోళనలూ వెలువడుతున్నాయి.
 

న్యూఢిల్లీ: Chinaలో మళ్లీ Coronavirus కేసులు పెరుగుతుండటంతో మన దేశంలోనూ ఆందోళనలు వెలువడ్డాయి. పండుగ సీజన్ కారణంగా నిపుణులూ Third Wave గురించి హెచ్చరించారు. దుర్గా నవరాత్రుల తర్వాత పశ్చిమ బెంగాల్‌లో కేసులు పెరగడమూ ఒకింత ఆందోళన కలిగింది. తాజాగా, మరో ఆందోళనకర వార్త వెలుగులోకి వచ్చింది. జమ్ము కశ్మీర్‌లో Cases అనూహ్యంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా శ్రీనగర్ మరో హాట్‌స్పాట్‌గా మారనున్నట్టు కథనాలు వస్తున్నాయి.

జమ్ము కశ్మీర్‌లో గత 24 గంటల్లో 165 కేసులు నమోదయ్యాయి. ఇందులో కశ్మీర్ డివిజన్‌లోనే 147 కేసులున్నాయి. కాగా, జమ్ములో 18 కేసులు రిజిస్టర్ అయ్యాయి. కాగా, కరోనా కారణంగా ముగ్గురు మరణించారు. ఇందులో కశ్మీర్‌లో ఇద్దరు, జమ్ములో ఒక్కరు మరణించినట్టు రిపోర్టులు వచ్చాయి. గత ఆరువారాల్లో ఇవే అత్యధిక కేసులు. దీంతో అధికారులు రంగంలోకి దిగారు. శ్రీనగర్ కొవిడ్ హాట్‌స్పాట్‌గా మారుతున్నది. ప్రస్తుతం కశ్మీర్ డివిజన్‌లో 968 యాక్టివ్ కేసులున్నాయి. ఇందులో 57శాతం అంటే 554 యాక్టివ్ కేసులు కేవలం శ్రీనగర్‌లోనే ఉన్నాయి. గత రెండు వారాలుగా ఇక్కడ కేసులు బీభత్సంగా పెరుగుతున్నాయి.

Also Read: పెంపుడు కుక్కకు కరోనా పాజిటివ్.. యజమాని నుంచే సోకినట్లు నిర్థారణ...

తాము అనేక కట్టడి చర్యలు తీసుకుంటున్నామని శ్రీనగర్ డీసీ ఎజాజ్ అసద్ తెలిపారు. మహమ్మారికి కళ్లెం వేయడానికి మైక్రో కంటైన్‌మెంట్ జోన్లనూ ఏర్పాటు చేశామని వివరించారు. లాల్ బజార్, హైదర్‌పొరా, చనపొరా, బెమినా వంటి ఐదు వార్డుల్లో కరోనా కర్ఫ్యూ అమలు చేస్తున్నామని చెప్పారు. గత కొన్ని రోజులుగా ఈ వార్డుల్లో అనూహ్యంగా ఎక్కువ కేసులు నమోదవుతున్నాయని, అందుకే కరోనా కర్ఫ్యూ విధించక తప్పలేదని అన్నారు. ఈ కేసుల కారణంగా వైద్య సిబ్బందికి ఈ ప్రాంతాలకు పంపామని, స్క్రీనింగ్ టెస్టులు జరుపుతున్నామని వివరించారు. అలాగే, రెండో డోసు టీకా పంపిణీని వేగవంతంగా చేశామని చెప్పారు.

Also Read: టీకా వేసుకోకుంటే నో పెట్రోల్.. నో రేషన్.. డెడ్‌లైన్ ఈ నెల 30

కొవిడ్ కేసుల కారణంగా హాస్పిటళ్లలో మెడికల్ స్టాఫ్ ఆందోళన పడుతున్నారు. కశ్మీర్ లోయలో టూరిస్టుల సంఖ్య పెరుగుతుండటం మరో ఆందోళనను తెచ్చి పెడుతున్నది. అయితే, టూరిస్టులను ఎయిర్‌పోర్టుల్లో పరీక్షిస్తున్నారని, కానీ, కేసులు పెరిగితే అది సరిపోదనే అభిప్రాయం వినిపిస్తున్నది. జమ్ము కశ్మీర్ అడ్మినిస్ట్రేషన్ ప్రతి రోజు 50 వేల కరోనా టెస్టులు చేపడుతున్నది.

click me!