తీరాన్ని దాటిన వాయుగుండం: విరిగిపడిన చెట్లు, వరదనీటితో భయానకం, చెన్నైకి విమానాల నిలిపివేత

By Siva Kodati  |  First Published Nov 11, 2021, 6:08 PM IST

గత కొన్నిరోజులుగా చెన్నైని వణికిస్తున్న వాయుగుండం తీరాన్ని తాకింది. వాయుగుండం ప్రభావంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. తమిళనాడులో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల ధాటికి తమిళనాడు రాష్ట్రంలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. వర్షం, ఈదురుగాలుల కారణంగా విమానాలను రద్దు చేశారు అధికారులు. చెన్నైకి రావాల్సిన విమానాలు హైదరాబాద్, ముంబై, కోల్‌కతాకు మళ్లిస్తున్నారు.  


గత కొన్నిరోజులుగా చెన్నైని వణికిస్తున్న వాయుగుండం తీరాన్ని తాకింది. వాయుగుండం ప్రభావంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. గంటలకు 55-60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. అటు వాయుగుండం ప్రభావంతో ఏపీలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో విస్తారంగా వానలు పడుతున్నాయి. ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల, తిరుపతిలోనూ భారీ వర్షం పడుతోంది. తమిళనాడులో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల ధాటికి తమిళనాడు రాష్ట్రంలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. వర్షం, ఈదురుగాలుల కారణంగా విమానాలను రద్దు చేశారు అధికారులు. చెన్నైకి రావాల్సిన విమానాలు హైదరాబాద్, ముంబై, కోల్‌కతాకు మళ్లిస్తున్నారు.  

అంతకుముందు చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు, చెంగల్‌పట్టు జిల్లాలకు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ గురువారం నాడు హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇవాళ  రాష్ట్రంలోని కడలూరు, కళ్లకురిచ్చి, విల్లుపురం, రాణిపేట్, వెల్లూరు, తిరువణ్ణామలై, కన్యాకుమారి, తిరునల్వేలి, తెన్‌కాసి జిల్లాల్లో కూడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.రాష్ట్రంలో ఈ నెల 6వ తేదీ నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి. 

Latest Videos

Also Read:తమిళనాడుకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ: చెన్నైలో సబ్‌వేల మూసివేత

ఇవాళ Heavy rains కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో Chennaiలోని సబ్ వేల ను మూసివేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. భారీ వర్షాలతో పాటు ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. చెన్నై సెంట్రల్-తిరువళ్లూరు మార్గంతో పాటు అంబత్తూరు, అవడిలో వరదల కారణంగా సబర్బన్ Trains నిలిచిపోయాయి. గుమిడిపూడి మార్గంలో సబర్బన్ రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.చెన్నైలోని పలు కాలనీలు నీటిలోనే ఉన్నాయి. టీ నగర్ వంటి ప్రాంతాల్లోని వీధులన్నీ నీటిలోనే ఉన్నాయి. మడిపాక్కం, తొరైపాక్కం, అంబత్తూరు, కొలత్తూరు, ఎన్నూర్, ముడిచూరులలో రోడ్లపై వరద నీరు ప్రవహిస్తోంది.ఇవాళ కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. చెన్నైలోని విరుగంబాక్కం, సాలిగ్రామం, కెకెనగర్ తో పాటు చెన్నైలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ కోతలున్నాయి.

click me!