కార్పెంటర్ ఇంట్లో దొంగతనానికి వచ్చి.. కామంతో యువతులపై లైంగిక దాడికి యత్నం..

By AN TeluguFirst Published Nov 11, 2021, 11:42 AM IST
Highlights

కామంతో కళ్లు మూసుకుపోయిన చోరులు ఇంట్లో ఉన్న యువతులపై Sexual assaultకి ప్రయత్నించారు. అయితే, వారు గట్టిగా కేకలు వేయడంతో పరారయ్యారు.

దొడ్డ బళ్లాపురం : దొడ్డ బళ్లాపురం పరిధిలోని రాజానుకుంట వద్ద అద్దిగానహళ్లి గ్రామంలో జూన్ 8వ తేదీ తెల్లవారు జామున ఒక కార్పెంటర్ ఇంట్లోకి నలుగురు దొంగలు చొరబడ్డారు. ఇంట్లో వారిని బెదిరించి రూ.10వేల నగదు, కొంత బంగారం దోచుకున్నారు. 

అంతటితో ఊరుకోకుండా.. కామంతో కళ్లు మూసుకుపోయిన చోరులు ఇంట్లో ఉన్న యువతులపై Sexual assaultకి ప్రయత్నించారు. అయితే, వారు గట్టిగా కేకలు వేయడంతో పరారయ్యారు. విచారణ జరిపిన పోలీసులు ఇద్దరు దొంగలను అరెస్ట్ చేశారు. వారినుంచి రూ.7 లక్షల విలువైన 151 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. మిగతా ఇద్దరి కోసం గాలిస్తున్నారు. 

మరో ఘటనలో రెండేళ్ల చిన్నారిపై లైంగిక దాడి
ఈ నెల మొదట్లో (నవంబర్ 2న)దొడ్డబళ్లాపురంలో రెండేళ్ల చిన్నారిపై లైంగిక దాడి చేసి హత్యాయత్నం చేసిన కామాంధున్ని మంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. బీహార్ కు చెందిన చందన్ (38) నిందితుడు. మంగళూరులోని హోయి బజార్ లో బీహార్ కు చెందిన సుమారు 30 కుటుంబాలు నివసిస్తున్నాయి. 

కామ పిశాచి: మహిళను చంపి శవంపై టీనేజర్ అత్యాచారం

ఆదివారం సాయంత్రం చిన్నారి తల్లిదండ్రులు బయటకు వెళ్లిన సమయంలో చందన్ ఓ బాలికపై rape చేసి అనంతరం నీళ్లు లేని ట్యాంకులో పడేసి వెళ్లిపోయాడు. తిరిగి వచ్చిన తల్లిదండ్రులు కాలనీ అంతా వెదికి చివరగా రాత్రి 9 గంటల సమయంలో water tankలో చూడగా చిన్నారి స్పృహ తప్పి పడి ఉంది. 

తక్షణం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు సోమవారం విచారణ జరపగా చిన్నారిని చందన్ తీసుకెళ్లాడని తెలిసింది. చందన్ ను అదుపులోకి తీసుకుని విచారణ జరపగా నిజం ఒప్పుకున్నాడు. 

విద్యార్థినిపై ప్రధానోపాధ్యాయుడు లైంగిక వేధింపులు

ఈ సెప్టెంబర్ లో బీహార్ లో సభ్యసమాజం తలదించుకునే సంఘటన జరిగింది. నాలుగో తరగతి చదువుతున్న 12 ఏళ్ల విద్యార్థినిపై ప్రధానోపాధ్యాయుడు లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన బీహార్‌లో కలకలం రేపింది. ఆ కీచకుడు బాధిత విద్యార్థిని చెంపను కొరికాడు. అయితే బాలిక భయంతో కేకలు వేయడంతో స్థానికులు పరుగుపరుగున వచ్చి ఆ హెడ్ మాస్టర్‌ను స్కూల్ గదిలో బంధించారు. ఈ ఘటన కతిహార్ జిల్లా పిప్రి బహియార్ లోని ప్రాథమిక పాఠశాలలో జరిగింది.

అనంతరం స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. policeలతో పాటు స్కూలు వద్దకు చేరుకున్న బాలిక కుటుంబ సభ్యులు, బంధువులు.. head masterను బయటకు లాగి పోలీసుల ముందే కర్రలతో చితకబాదారు. ఆగ్రహంతో ఊగిపోయిన జనం నుంచి ప్రధానోపాధ్యాయుడిని కాపాడడం పోలీసులకు సైతం కష్టతరమైపోయింది. ఎలాగోలా వారి బారి నుంచి అతడిని తప్పించిన పోలీసులు.. స్టేషన్ కు తరలించారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

అయితే, ఘటన జరిగినప్పుడు అసలేం జరిగిందో తనకు అర్థం కాలేదని, తన బుర్ర పనిచేయలేదని నిందితుడు పోలీసులకు చెప్పాడు. మరోవైపు హెడ్ మాస్టర్‌ను చితకబాదిన వీడియోలు వైరల్ కావడంతో.. కటిహార్ ఏఎస్పీ రష్మి స్పందించారు. ఆ వీడియోలు ఇంకా తన దృష్టికి రాలేదని, ఒకవేళ అదే నిజమైతే దాడి చేసిన వారిపైనా చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. 

click me!