పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బంగారు గొలుసు మింగిన చైన్ స్నాచర్లు .. తర్వాత ఏం జరిగిందంటే!

By Rajesh KarampooriFirst Published May 29, 2023, 5:23 AM IST
Highlights

ఓ దొంగ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ఏకంగా బంగారు గొలుసునే మింగేశాడు. ఈ ఘటన జార్ఖండ్ రాజధాని రాంచీలో జరిగింది. 

ఇటీవల గొలుసు దొంగతనాలు తీవ్రమవుతున్నాయి. ఎక్కడ పడితే అక్కడ చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. దీంతో ఇలాంటి దొంగలపై ఓ కన్నేశారు పోలీసులు. తాజాగా ఓ చైన్ స్నాచర్ బంగారు గొలుసు దొంగతనం చేసి.. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ఏకంగా ఆ బంగారు గొలుసునే మింగేశాడు. ఇంకేముంది.. ఆ చైన్ గొంతులో ఇరుక్కుపోయింది. దీంతో అతడు ఆసుపత్రి పాలయ్యాడు. ఈ ఘటన జార్ఖండ్‌లోని రాంచీలో చోటుచేసుకుంది. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డోరండా పోలీస్ స్టేషన్ పరిధిలోని దుబాది వంతెన సమీపంలో సల్మాన్, జాఫర్ అనే ఇద్దరు స్నాచర్లు ఓ మహిళ మెడలోంచి బంగారు గొలుసు లాక్కెళ్లారు. ఆ ఇద్దరు దొంగలు ద్విచక్రవాహనంపై పరారయ్యారు. అయితే.. నేరం జరిగిన ప్రాంతానికి కొద్ది దూరంలోనే ఐదుగురు పోలీసులు వారిని వెంబడించడం ప్రారంభించారు. దాదాపు సల్మాన్‌, జాఫర్‌లను పోలీసులు ఒక కిలోమీటరు మేర వెంబడించి పట్టుకున్నారు. అయితే.. పోలీసుల బారి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో సల్మాన్ చోరీ చేసిన బంగారు గొలుసును మింగేశాడు. అయితే.. సల్మాన్ చైన్ మింగుతుండగా పోలీసు అధికారులు చూశారు.

దీంతో సల్మాన్ పొత్తికడుపు, ఛాతీకి ఎక్స్ రే పరీక్షలు నిర్వహించాలని డీఎస్పీ రాజా మిత్ర ఆదేశించారు. ఎక్స్-రేలో సల్మాన్ ఛాతీలో బంగారు గొలుసు ఇరుక్కుపోయింది. ఆ తర్వాత ఇబ్బందికి గురయ్యాడు. దీంతో అతడ్ని చికిత్స నిమిత్తం రాజేంద్ర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్)లో చేర్పించారు. ఎక్స్‌ రే తీయించగా గోల్డ్‌ చైన్‌ అతడి శరీరం లోపల చిక్కుకున్నట్లు గ్రహించారు. ఈ నేపథ్యంలో డాక్టర్ల బృందం అతడ్ని పర్యవేక్షణలో ఉంచారు. గ్యాస్ట్రోస్కోపీ, ఎండోస్కోపీ లేదా శస్త్రచికిత్స ద్వారా బంగారు గొలుసును సల్మాన్‌ శరీరం నుంచి బయటకు తీయాలని వైద్యులు యోచిస్తున్నారు.

click me!