ఇది దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన ఘట్టం: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 

నూతన పార్లమెంటు ప్రారంభోత్సవం దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినదని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన సందేశంలో పేర్కొన్నారు. ఇది దేశ ప్రజలందరికీ గర్వకారణం, సంతోషదాయకమన్నారు. మన ప్రజాస్వామిక ప్రయాణంలో ముఖ్యమైన మైలురాయిగా అభివర్ణించారు.  

Google News Follow Us

కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించడాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్వాగతించారు. ఇది యావత్ దేశానికి గర్వకారణమనీ, ఎనలేని ఆనందాన్ని కలిగించిందని అన్నారు. నూతన పార్లమెంటు భవన ప్రారంభోత్సవం దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినదని రాష్ట్రపతి తన సందేశంలో పేర్కొన్నారు. కొత్త పార్లమెంటు భవనం ప్రారంభోత్సవం భారతదేశ ప్రజలందరికీ గర్వకారణం, సంతోషదాయకమన్నారు.

రాష్ట్రపతి సందేశాన్ని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ చదివి వినిపించారు. పార్లమెంటును దేశానికి మార్గదర్శకంగా అభివర్ణించిన అధ్యక్షుడు ముర్ము.. కొత్త పార్లమెంటు భవనం "మన ప్రజాస్వామ్య ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయి" అని పేర్కొన్నారు. ‘నూతన పార్లమెంట్‌ భవనాన్ని ప్రారంభించిన సందర్భం భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. కొత్త పార్లమెంటు భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ప్రారంభించారని పేర్కొన్నారు.

ఇక.. పార్లమెంటు నూతన భవనం దేశప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేరస్తుందని ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ అన్నారు. బానిస మనస్తత్వం నుంచి విముక్తికి చిహ్నంగా నిలుస్తుందని అన్నారు. ఉప రాష్ట్రపతి సందేశాన్ని కూడా లోక్‌సభలో హరివంశ్‌ చదవి వినిపించారు. 

కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా స్పందిస్తూ.. అమృతోత్సవ వేళ ప్రతి రంగంలో అత్యుత్తమంగా  సాగుతున్న ప్రయాణంలో నూతన పార్లమెంటు ప్రారంభోత్సవం తొలి అడుగు అని పేర్కొన్నారు. నూతన పార్లమెంటు భవనంలో  ప్రధాని మోదీ ప్రతిష్ఠించిన రాజదండం... భారతదేశ సాంస్కృతిక వారసత్వానికి, వర్తమానానికి మధ్య వారధి నిలుస్తుందని పేర్కొన్నారు.