అధ్వాన్నమైన రహదారులు.. ఆగిపోయిన అంబులెన్స్.. బిడ్డ మృతదేహాన్ని భుజాన మోసుకెళ్లిన కన్నతల్లి.. 

By Rajesh KarampooriFirst Published May 29, 2023, 3:14 AM IST
Highlights

బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించిన ఆనైకట్టు పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం అంబులెన్స్‌లో తీసుకెళ్లి మృతదేహాన్ని అంత్యక్రియల నిమిత్తం తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ ఘటన తమిళనాడులోని వెల్లూరు జిల్లా చోటు చేసుకుంది.

దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు గడిచాయి. కానీ కొన్నిసార్లు కొన్ని ఘటనలు నమ్మడానికి అసాధ్యం అనిపిస్తుంది. సాధారణంగా నగరాల్లో మెరిసే భవనాలు, అద్భుతమైన రోడ్లు కనిపిస్తాయి, కానీ, అదే నగరానికి సమీపంలో ఉన్న గ్రామానికి సరైన రోడ్డు లేకపోవడం ఊహించగలరా..? అత్యవసర పరిస్థితిలో ఓ అంబులెన్స్ రావడానికి రోడ్డు కూడా లేదు. ఈ కారణంగానే ఓ తల్లి తన కూతురి మృతదేహాన్ని భుజాన వేసుకుని కిలోమీటర్ల మేర మోసుకెళ్లాల్సి వచ్చింది.

ఈ ఘటన తమిళనాడులోని వెల్లూరు జిల్లా చోటు చేసుకుంది.  ఈ జిల్లాలోని అల్లేరి గ్రామంలో రోడ్డు అధ్వాన్నంగా ఉండడంతో ఓ మహిళ తన కూతురి మృతదేహాన్ని భుజంపై మోయాల్సి వచ్చింది. దారిలో గుంతల కారణంగా అంబులెన్స్‌ మార్గమధ్యలో విరిగిపోయింది. 18 నెలల బాలిక తన తల్లిదండ్రులతో కలిసి ఇంటి బయట నిద్రిస్తుండగా.. పాము కాటుకు గురైంది.  బాలిక ఆరోగ్యం విషమంగా ఉందని తెలుసుకున్న కుటుంబ సభ్యులు, తండ్రి విజి, తల్లి ప్రియ ఆమెను ఆనైకట్టు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రోడ్డు లేకపోవడంతో ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు చాలా సమయం పట్టింది. వైద్యులు బాలికను పరిశీలించి మృతి చెందినట్లు తెలిపారు. ఆలస్యం కావడంతో విషం చిన్నారి శరీరమంతా వ్యాపించిందని తెలిపారు. 

బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించిన ఆనైకట్టు పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం అంబులెన్స్‌లో తీసుకెళ్లి మృతదేహాన్ని అంత్యక్రియల నిమిత్తం తల్లిదండ్రులకు అప్పగించారు. వెల్లూరులో రోడ్లు అధ్వాన్నంగా ఉండడంతో బాధితురాలి తల్లిదండ్రులు, చనిపోయిన బాలికతో వెళ్తున్న అంబులెన్స్‌ పాడైపోయింది. దీంతో లోకాన్ని వీడిన కుతూరిని ఆ తల్లి తన భుజంపై ఎత్తుకుని ఎగుడు దిగుడు రోడ్డు గుండా కాలినడకన గ్రామానికి చేరుకుంది. అంతకుముందు ఫిబ్రవరిలో, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్, చెన్నై నుండి రాణిపేట (NH-4) ను కలిపే రహదారి దుస్థితి గురించి కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీకి లేఖ రాశారు. రోడ్డు పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉందని, వేలూరు, రాణిపేట్, తిరుపత్తూరు, తిరువణ్ణామలై జిల్లాలకు రైలులో వెళ్లేందుకు ప్లాన్ చేసుకోవాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

click me!