గుడిలో దొంగతనానికి వచ్చి దేవుడికి నమస్కారం చేసి....!

Published : Oct 28, 2022, 02:37 PM IST
గుడిలో దొంగతనానికి వచ్చి దేవుడికి నమస్కారం చేసి....!

సారాంశం

గుడిలోని సీసీ కెమేరాలో ఈ ఘటన మొత్తం రికార్డు కాగా... వీడియో.. నెట్టింట వైరల్ గా మారింది.

ఓ వ్యక్తి గుడిలో దొంగతనానికి వచ్చాడు.  గుడిలో ఉన్న హుండీని దోచుకోవడానికి వచ్చి... ముందుగా దేవుడికి నమస్కారం చేసుకున్నాడు. ఆ తర్వాత... దోచుకోవడానికి వెళ్లాడుడ. ఈ సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకోగా... దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. గుడిలోని సీసీ కెమేరాలో ఈ ఘటన మొత్తం రికార్డు కాగా... వీడియో.. నెట్టింట వైరల్ గా మారింది.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్ పూర్ లో ఓ వ్యక్తి హనుమాన్ ఆలయలో దొంగతనానికి వచ్చాడు. ఆ సమయంలో అతను వెంటనే దొంగతనం చేయడానికి వెళ్లలేదు.  ముందుగా... హనుమాన్ కి నమస్కారం చేసుకున్నాడు. ముందుగా దేవుడికి క్షమాపణలు చెప్పాడు. చెప్పులు కూడా గుడి బయటే ఇప్పడం గమనార్హం. ఆ తర్వాత.. చోరీ చేయడానికి ప్రయత్నించడం గమనార్హం. గుడిలోని సీసీ కెమేరాల్లో ఈ ఘటన మొత్తం రికార్డు కావడం గమనార్హం.

 

మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో సోమవారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. తెల్లవారుజామున చోరీ జరిగినట్లు ఆలయ అధికారులు తెలిపారు.ప్రస్తుతం నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

DAIS : ఐశ్వర్యారాయ్ కూతురు చదివే ధీరూభాయ్ అంబానీ స్కూల్ ఫీజు ఎంత?
ఆకాష్, అనంత్ అంబానీలు తెలుసు... మరి ఎవరీ జై అన్మోల్ అంబానీ?