ట్విట్టర్ సీఈవో పరాగ్ అగర్వాల్‌పై ఎలాన్ మస్క్ వేటు.. ట్విట్టర్‌లో మీమ్‌ల వరద

Published : Oct 28, 2022, 02:37 PM IST
ట్విట్టర్ సీఈవో పరాగ్ అగర్వాల్‌పై ఎలాన్ మస్క్ వేటు.. ట్విట్టర్‌లో మీమ్‌ల వరద

సారాంశం

ట్విట్టర్‌ను ఎలన్ మస్క్ చేజిక్కించుకోగానే వెంటనే సీఈవో పరాగ్ అగర్వాల్, ఇతర టాప్ లీడర్లను తొలగించడం సంచలనమైంది. దీనిపై ట్విట్టర్లు మీమ్‌లు కుప్పలు తెప్పలుగా వచ్చాయి.  

న్యూఢిల్లీ: మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌ను ఎట్టకేలకు బిలియనీర్, టెస్లా చీఫ్ ఎలన్ మస్క్ సొంతం చేసుకున్నారు. సుమారు ఆరు నెలల క్రితం ప్రకటించిన డీల్‌ను ఆయన పూర్తి చేశారు. కోర్టు విధించిన డెడ్‌లైన్ మీట్ అయ్యారు. ఆయన ట్విట్టర్ సంస్థను సొంతం చేసుకోగానే కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. మేనేజ్‌మెంట్‌లో మార్పులు చేశారు. ట్విట్టర్ సీఈవో పరాగ్ అగర్వాల్‌ను వెంటనే తొలగించారు. ఆయనతోపాటు ట్విట్టర్ లీగల్, పాలసీ, ట్రస్ట్ హెడ్ విజయ గద్దె, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నెడ్ సెగల్‌, జనరల్ కౌన్సెల్ సియన్ ఎడ్గెట్‌లను ఆయన తొలగించారు. సీఈవో పరాగ్ అగర్వాల్‌ను తొలగించగానే.. అదే ట్విట్టర్‌లో మీమ్‌లు కుప్పలు తెప్పలుగా వచ్చి పడ్డాయి. 

మంగ్లం తివారీ అనే ట్విట్టర్ యూజర్ ట్విట్టర్ మాజీ చీఫ్ పై ఓ మీమ్ పోస్టు చేశాడు. పాపులర్ బాలీవుడ్ యాక్టర్ అమ్రిష్ పురి.. ఓ డైలాగ్ పరాగ్ అగర్వాల్‌ను ఉద్దేశించి చెబుతున్నట్టు ఆ మీమ్ ఉన్నది. ‘నువ్వో పెద్ద సోషల్ మీడియా వేదికకు సీఈవో అనేది అసలు విషయమే కాదు. కేవలం ప్రభుత్వ ఉద్యోగాల్లో మాత్రమే ఉద్యోగ భద్రత ఉంటుంది’ అని మీమ్ ఉన్నది. చైనా కాంగ్రెస్ కమిటీలో జరిగిన ఓ సంచలన ఘటనను ఆధారంగా తీసుకుని ఇంకో మీమ్ వచ్చింది.

Also Read: Twitter Deal : ట్విట్టర్ డీల్ కోసం ఎలాన్ మస్క్ డబ్బులు ఎలా సేకరిస్తున్నారో తెలిస్తే ఆశ్యర్యపోతారు..

చైనా కాంగ్రెస్‌లో ఆ దేశ అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ పక్కనే మాజీ చీఫ్ హు జింటావో కూర్చోవడం వారికి అభ్యంతరమైంది. అందుకే ఆ చైనా మాజీ చీఫ్ హు జింటావోను అక్కడి నుంచి తొలగిస్తుండగా ఆయన షాకింగ్, దీనంగా ప్రస్తుత చైనా చీఫ్ జీ జిన్‌పింగ్ వైపు చూస్తుంటారు. ఈ ఘటన ఆధారంగానే ఎలన్ మస్క్ ప్రస్తుత చైనా అధ్యక్షుడి ప్లేస్‌లో కూర్చుని ఉండగా మాజీ అధ్యక్షుడిగా పరాగ్ అగర్వాల్‌ను చిత్రించారు.

మరొకరు అగర్వాల్ స్వీట్స్ అండ్ స్నాక్స్ అనే షాప్ పిక్‌ను పోస్టు చేసి జోక్ చేశాడు. పరాగ్ అగర్వాల్ ట్విట్టర్ హెడ్‌క్వార్టర్ ఎదురే మళ్లీ దిగాడు అంటూ కామెంట్ చేశాడు. 

Also Read: టెస్లా అధినేత చేతికి ట్విట్టర్‌.. సి‌ఈ‌ఓతో సహ ఎగ్జిక్యూటివ్‌ల తొలగింపు..: రిపోర్ట్

ఇంకొకరు బాలీవుడ్ హీరో గోవింద కామెడీ సీన్ పోస్టు చేశారు. ఆ వీడియోలో హీరో గోవింద కొత్తగా ఆఫీసుకు వచ్చి.. కనిపిచ్చిందల్లా అమ్మేసి పడేయండి.. ఆ డబ్బులు తన కొత్త బ్యాంకు కొత్త ఖాతాలో వేయాలని పక్కనే ఉన్న వ్యక్తికి సూచిస్తూ ఉంటాడు. ఆ సీన్ రిఫరెన్స్ తీసుకుని ఓ వ్యక్తి.. ఇలా కామెంట్ పెట్టాడు. ట్విట్టర్‌ను చేజిక్కించుకున్న తర్వాత ఎలన్ మస్క్ ఇదే విధంగా పరాగ్ అగర్వాల్, నెడ్ సెగల్, విజయ్ గద్దెలను ఫైర్ చేశాడు అంటూ లాఫింగ్ ఎమోజీ పెట్టాడు. 

బాలీవుడే కాదు.. హాలీవుడ్ అవేంజర్స్ సిరీస్‌లోని సూపర్ విలన్ థానోస్‌గా ఎలన్ మస్క్‌ను చిత్రించగా.. ఆయన చిటికేయగానే.. సినిమాలోలాగా ట్విట్టర్ ఎంప్లాయీస్ అంతా మాయమైపోతున్నట్టు ఫొటో పెట్టాడు.

PREV
click me!

Recommended Stories

PM Modi Visit Ethiopia: మోదీ కి గుర్రాలపై వచ్చి స్వాగతం స్వయంగా కారునడిపిన పీఎం| Asianet News Telugu
PM Narendra Modi: దేశం గర్వపడేలా.. సౌదీ రాజులు దిగివచ్చి మోదీకి స్వాగతం| Asianet News Telugu