ఐదేండ్ల‌పాటు సిద్ద‌రామ‌య్య‌నే క‌ర్నాట‌క‌ సీఎం.. ఎంబీ పాటిల్ వ్యాఖ్యలు కాంగ్రెస్ లో వర్గపోరుకు దారితీయనుందా..?

Published : May 23, 2023, 01:47 PM ISTUpdated : May 23, 2023, 01:48 PM IST
ఐదేండ్ల‌పాటు సిద్ద‌రామ‌య్య‌నే క‌ర్నాట‌క‌ సీఎం.. ఎంబీ పాటిల్ వ్యాఖ్యలు కాంగ్రెస్ లో వర్గపోరుకు దారితీయనుందా..?

సారాంశం

Bengaluru: ఇటీవ‌ల జ‌రిగిన క‌ర్నాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ తిరుగులేని విజ‌యంతో అధికార  పీఠం ద‌క్కించుకుంది. అయితే, సీఎం ప‌ద‌వి కోసం డీకే శివ‌కుమార్, సిద్ద‌రామ‌య్యాలు పోటీ ప‌డ‌టంతో.. కాంగ్రెస్ అగ్ర‌నాయ‌క‌త్వం ఇరువురు నాయ‌కుల‌తో చ‌ర్చ‌లు జ‌రిపి సిద్ద‌రామ‌య్య‌ను సీఎం ప‌దవిలో కూర్చోబెట్ట‌గా, డీకే శివ‌కుమార్ ఉప ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించారు.  

No power sharing in K'taka leadership: సిద్దరామయ్య, డీకే శివకుమార్ ల మధ్య ఎలాంటి అధికార భాగస్వామ్య ఫార్ములా లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎంబీ పాటిల్ పేర్కొన్నారు. వచ్చే ఐదేళ్ల పాటు సిద్దరామయ్య కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉంటారని చెప్పారు. అధికార మార్పిడి ఫార్ములా ఉంటే కాంగ్రెస్ ఈపాటికి ప్రకటించేదని పాటిల్ అన్నారు. మరోవైపు సీఎం పదవిని సిద్ధరామయ్య, డీకే శివకుమార్ చెరో 30 నెలల పాటు పంచుకుంటారని, వచ్చే ఏడాది జరిగే లోక్ సభ ఎన్నికల వరకు ఆయన కేపీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతారని కాంగ్రెస్ లోని ప‌లువురు నాయ‌కులు పేర్కొంటున్నారు. 

‘‘సిద్దరామయ్య ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉంటారని.. అధికార భాగస్వామ్య ఒప్పందం కుదిరి ఉంటే సీనియర్ నేతలు మాకు తెలియజేసేవారు.. అలాంటి ప్రతిపాదనే లేదు.. అలాంటి ప్రతిపాదన ఉంటే.. ఏఐసీసీ నాయ‌కులు కేసీ వేణుగోపాల్ లేదా ఇత‌ర నాయ‌కులు తెలియజేసి ఉండేవారు’’ అని పాటిల్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి పదవి కోసం మూడు రోజులకు పైగా కాంగ్రెస్ నేతలు సిద్ధరామయ్య, డీకే శివకుమార్ బహిరంగంగానే గొడవ పడగా, చివరకు సిద్ధరామయ్య, శివకుమార్ లు సీఎం, డిప్యూటీ సీఎం పదవుల‌ను చేప‌ట్టారు. అధిష్ఠానంపై వివాదం ముగిశాక సిద్ధరామయ్యతో రెండున్నరేళ్ల పాటు అధికార భాగస్వామ్యానికి డీకే శివకుమార్ అంగీకరించినట్లు వార్తలు వచ్చాయి. 

కర్ణాటక కాంగ్రెస్ లో తాజా పరిణామాలతో ఇద్దరు కర్ణాటక కాంగ్రెస్ పెద్దల మధ్య మళ్లీ ఆధిపత్య పోరు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఎంబీ పాటిల్ వ్యాఖ్యలపై డీకే శివకుమార్ శిబిరం ఇంకా స్పందించకపోవడంతో కర్ణాటక ఉపముఖ్యమంత్రి వర్గంలో ఆందోళన నెలకొంది. కాగా, ఇటీవ‌ల జ‌రిగిన క‌ర్నాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ తిరుగులేని విజ‌యంతో అధికార  పీఠం ద‌క్కించుకుంది. అయితే, సీఎం ప‌ద‌వి కోసం డీకే శివ‌కుమార్, సిద్ద‌రామ‌య్యాలు పోటీ ప‌డ‌టంతో.. కాంగ్రెస్ అగ్ర‌నాయ‌క‌త్వం ఇరువురు నాయ‌కుల‌తో చ‌ర్చ‌లు జ‌రిపి సిద్ద‌రామ‌య్య‌ను సీఎం ప‌దవిలో కూర్చోబెట్ట‌గా, డీకే శివ‌కుమార్ ఉప ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించారు.

శనివారం బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో జరిగిన ప్రమాణ స్వీకారోత్సవంలో సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌తో పాటు మరో ఎనిమిది మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 135 సీట్లు గెలుచుకోగా, బీజేపీ 66, జేడీ-ఎస్ 19 సీట్లు గెలుచుకుంది. 
 

PREV
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం