మ‌ణిపూర్ లో మ‌ళ్లీ హింస‌.. ప‌లు ఇండ్ల‌కు నిప్పు.. భారీగా మోహ‌రించిన భ‌ద్ర‌తా బ‌ల‌గాలు

Published : May 23, 2023, 01:14 PM IST
మ‌ణిపూర్ లో మ‌ళ్లీ హింస‌.. ప‌లు ఇండ్ల‌కు నిప్పు.. భారీగా మోహ‌రించిన భ‌ద్ర‌తా బ‌ల‌గాలు

సారాంశం

Imphal: ఈశాన్య భార‌త రాష్ట్రమైన మ‌ణిపూర్ లో మ‌ళ్లీ హింస చెల‌రేగింది. ఈ క్ర‌మంలోనే ఇంఫాల్ లో సోమ‌వారం రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ విలేకరుల సమావేశం నిర్వహించారు. తాజా హింస నేప‌థ్యంలో రాష్ట్ర బలగాలతో పాటు పారామెడికల్ బలగాలను మోహరించినందున కేంద్ర హోంమంత్రి అమిత్ షా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. రాష్ట్ర బ‌ల‌గాల‌తో పాటు కేంద్ర పారామెడికల్ దళాలలు ఉద్రిక్త పరిస్థితులను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాయని తెలిపారు.

Manipur violence: మణిపూర్ లో మళ్లీ హింస చెల‌రేగింది. పాడుబడిన ప‌లు ఇళ్లకు దుండ‌గులు నిప్పుపెట్టారు. మణిపూర్ రాజధాని ఇంఫాల్ లో తాజాగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఇంఫాల్ లోని న్యూ లంబూలేన్ ప్రాంతంలో పాడుబడిన ఇళ్లకు ఓ గుంపు నిప్పుపెట్టగా, ముగ్గురు దుండగులను అధికారులు అరెస్టు చేశారు. న్యూ చెకాన్ బజార్ ప్రాంతంలో ఘర్షణలు చెలరేగాయి. అగ్నిప్రమాదం నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కర్ఫ్యూ విధించారు. గతంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కర్ఫ్యూను సడలించారు. ఇంటర్నెట్ సేవలపై నిషేధాన్ని మరో ఐదు రోజులు పొడిగించారు.

కాగా, ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ లో మే 3వ తేదీ నుంచి జరిగిన హింసాకాండలో ఇప్ప‌టివ‌ర‌కు 70 మంది మ‌ర‌ణించారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌భుత్వం రాష్ట్రంలో క‌ఠిన ఆంక్ష‌లు విధించింది. రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్ష‌న్ విధించింది. ఇంట‌ర్నెట్ సేవ‌ల‌పైనా ఆంక్ష‌లు విధించింది. ప‌రిస్థితులు కాస్త కుదుట‌ప‌డ్డాక‌, ఆంక్ష‌ల‌ను స‌డ‌లించింది. అయితే, మ‌రోసారి మంగళవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.  దీంతో అప్ర‌మ‌త్త‌మైన అధికార యంత్రాంగం చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఇంఫాల్ ఈస్ట్ జిల్లాలోని న్యూ చెకాన్ ప్రాంతంలో మంగళవారం ఉదయం వ్యాపార సంస్థలు మూసివేయబడ్డాయి. ప్రజలను పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా ఇళ్లలోనే ఉండాలని భద్రతా సిబ్బంది కోరారు. ఇక్క‌డి మాజీ ఎమ్మెల్యేతో సహా నలుగురు సాయుధులు సోమవారం తమ దుకాణాలను బలవంతంగా మూసివేయడంతో ఒక గుంపు రెండు ఇళ్లను తగలబెట్టిందని స‌మాచారం. 

కుకీ మిలిటెంట్లతో ఆపరేషన్ సస్పెన్షన్ (ఎస్ వో) రద్దు చేయాలనీ, వారిపై చర్యలు తీసుకోవాలని ఆందోళనకారులు డిమాండ్ చేయడంతో లోయ జిల్లాల్లో మహిళలు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. అక్రమ మయన్మార్ వలసదారులను బహిష్కరించాలనీ, కొండ ప్రాంతాల్లో గసగసాల సాగును నిలిపివేయాలని, రాష్ట్రాన్ని విభజించాలన్న కొండ ఎమ్మెల్యేల డిమాండ్ ను వారు నిరసించారు. కుకి మిలిటెంట్లు లోయలోకి దిగి పౌరులపై కాల్పులు జరిపారని కొండలను ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు ఫిర్యాదు చేశారు. ఇంఫాల్ వెస్ట్ జిల్లాలోని మొయిడాంగ్పోక్ గ్రామంలో ఇటీవల జరిగిన ఒక సంఘటనలో కనీసం ముగ్గురు గాయపడ్డారు. కర్ఫ్యూ సడలింపు వ్యవధిని రెండు గంటలు కుదించి, ఇప్పుడు ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఆంక్షలు విధించారు. 

అమాయకుల ఇళ్లను తగలబెట్టడం ఆపాలని ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ సోమవారం సాయంత్రం ప్రజలకు విజ్ఞప్తి చేశారు. న్యూ చెకాన్ ఘటనలో మాజీ ఎమ్మెల్యే సహా ముగ్గురిని అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. సాయుధుల్లో ఒకరిని దుండగులు చితకబాదగా, మిగిలిన ముగ్గురు అక్కడి నుంచి పరారయ్యారు. ఖాళీ ఇళ్లను ప్రజలకు అద్దెకు ఇచ్చేందుకు వినియోగించడంతో అగ్నిప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని... కేంద్ర బలగాల నుంచి మరో 20 కంపెనీల భద్రతా సిబ్బందిని రంగంలోకి దింపుతున్న‌ట్టు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 10 వేల మంది ఆర్మీ, అస్సాం రైఫిల్స్ జవాన్లు మోహరించారు. భద్రతా దళాలు మానవ రహిత వైమానిక వాహనాలు, చీతా హెలికాప్టర్ల ద్వారా వైమానిక నిఘా నిర్వహిస్తున్నాయి. రాష్ట్రం లోపల, వెలుపల సామాజిక మాధ్యమాల్లో విద్వేషాలు రెచ్చగొట్టే వారిపై కూడా చర్యలు తీసుకుంటామని సీఎం చెప్పారు.

PREV
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం