
జనవరి 22న రామ మందిర ప్రతిష్ఠాపన కార్యక్రమం నేపథ్యంలో అయోధ్యకు ఉగ్ర ముప్పు పొంచి ఉందని ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు హెచ్చరించాయి. రాజకీయ నాయకులు, అధికారులను లక్ష్యంగా చేసుకుని ఈ ప్రాంతంలో అశాంతి సృష్టించేందుకు ఉగ్రవాదులు సిద్ధమవుతున్నట్లు సమాచారం. రాడికల్ శక్తులు ఒక నిర్దిష్ట వర్గాన్ని పదేపదే రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నాయని కేంద్ర భద్రతా సంస్థలు నివేదించాయి.
పనుల మీద కంటే ప్రచారం మీద ఫోకస్ చేసుంటే బీఆర్ఎస్ గెలిచేది - మాజీ మంత్రి కేటీఆర్
‘ఇండియా టీవీ’ కథనం ప్రకారం.. ప్రస్తుత ఇజ్రాయెల్-హమాస్ వివాదాన్ని కూడా ఉగ్రవాదులు ఇజ్రాయెల్ కు అనుకూలంగా భారత ప్రభుత్వ వైఖరిని మార్చడానికి ఉపయోగించుకున్నారని నిఘా వర్గాలు తెలిపాయి. ఈ హెచ్చరికల నేపథ్యంలో ఈ ముప్పును ఎదుర్కొనేందుకు కేంద్ర సంస్థలు ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించాయి. ఇంటిలిజెన్స్ సమాచారం మేరకు రామజన్మభూమి వేడుకల సందర్భంగా మోహరించిన అన్ని భద్రతా సంస్థలు అలెర్ట్ అయ్యాయి.
ఉత్తర్ ప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో అశాంతిని వ్యాపింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని. అంతర్జాతీయ సమాజాల ముందు భారత వ్యతిరేక వాతావరణాన్ని సృష్టించడానికి జాతి వ్యతిరేక గ్రూపులు సోషల్ మీడియాలో అనేక పోస్టులను సిద్ధం చేశాయని ఏజెన్సీలు తెలిపాయి. కాగా.. రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ వేడుక నేపథ్యంలో ఇప్పటికే అయోధ్యలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు జరిగాయి. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం అధునాతన భద్రతా ప్రోటోకాల్స్, సమర్థవంతమైన ట్రాఫిక్ నిర్వహణ వ్యూహాలతో కూడిన సమగ్ర ప్రణాళికను అమలు చేస్తోంది. ఈ కార్యక్రమానికి అవసరమైన భద్రతా చర్యల్లో సీసీ కెమెరాల ఏర్పాటు, యాంటీ డ్రోన్ వ్యవస్థ తదితర జాగ్రత్తలు తీసుకున్నారు.
విమానం డోర్ తెరిచి దూకేసిన ప్రయాణికుడు..
ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్ మెంట్ సిస్టం (ఐటీఎంఎస్ )ను నగరవ్యాప్తంగా 1,500 పబ్లిక్ సీసీటీవీ కెమెరాలతో అనుసంధానం చేసి సమగ్ర, అప్రమత్త నిఘా ఏర్పాటు చేశారు. అయోధ్యలోని ఎల్లో జోన్లో ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీతో కూడిన 10,715 ఏఐ ఆధారిత కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ కెమెరాలను ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్ మెంట్ సిస్టమ్ (ఐటీఎంఎస్ )తో అనుసంధానం చేసి సెంట్రల్ కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షిస్తారు. ఈ వ్యూహాత్మక చొరవ కీలకమైన ప్రాంతంలో మొత్తం పర్యవేక్షణ, భద్రతను పెంపొందించడానికి ఉపయోగపడుతుంది.
రామాలయ ప్రతిష్ఠా కార్యక్రమం సందర్భంగా వైమానిక దాడులు జరగకుండా, అదనపు భద్రతను కల్పించేందుకు ఉత్తర ప్రదేశ్ పోలీసులు యాంటీ డ్రోన్ వ్యవస్థను కూడా మోహరించనున్నారు. యాంటీ డ్రోన్ వ్యవస్థను ఉత్తరప్రదేశ్ పోలీసులకు చెందిన స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ (ఎస్ఎస్ఎఫ్) పర్యవేక్షిస్తుంది.
పనుల మీద కంటే ప్రచారం మీద ఫోకస్ చేసుంటే బీఆర్ఎస్ గెలిచేది - మాజీ మంత్రి కేటీఆర్
కాగా.. జనవరి 22న రామ మందిర గర్భగుడిలో రామ్ లల్లాను ప్రాణ ప్రతిష్ట చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ హాజరుకానున్నారు. వారణాసికి చెందిన వేద పూజారి లక్ష్మీకాంత్ దీక్షిత్ జనవరి 22న రామ్ లల్లా ప్రతిష్ఠాపన కార్యక్రమంలో ప్రధాన పూజలు నిర్వహించనున్నారు. జనవరి 14 నుంచి 22 వరకు అయోధ్యలో అమృత్ మహోత్సవ్ జరగనుంది. ఈ వేడుకకు హాజరుకావాలని దేశ, విదేశాలకు చెందిన ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి.