జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ గురువారం తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఆమె ప్రయాణిస్తున్న కారు జమ్మూకాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలోని సంగమ్‌లో ప్రమాదానికి గురైంది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ గురువారం తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఆమె ప్రయాణిస్తున్న కారు జమ్మూకాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలోని సంగమ్‌లో ప్రమాదానికి గురైంది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీని ప్రకారం ప్రమాదం తర్వాత కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయ్యింది.
అగ్నిప్రమాద బాధితులను కలవడానికి ముఫ్తీ ఖానాబాల్‌కు వెళ్తున్నట్లు సమాచారం. అయితే ప్రమాదంలో ఆమెకు ఎలాంటి గాయాలు కాలేదు. కానీ మెహబూబా ముఫ్తీ భద్రతా సిబ్బందిలోని ఓ పోలీస్ అధికారికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ప్రమాదానికి సంబంధించి ముఫ్తీ కుమార్తె ఇల్తిజా మాట్లాడుతూ.. అనంత్ నాగ్‌లో ప్రయాణిస్తున్న ముఫ్తీ కారు ప్రమాదానికి గురైంది. భగవంతుడి దయ వల్ల ఆమె, భద్రతా అధికారులు సురక్షితంగా బయటపడ్డారు అని తెలిపింది.
మరోవైపు.. ప్రమాద విషయం తెలుసుకున్న నేషనల్ కాన్ఫరెన్స్ నేత, జమ్మూకాశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్ధుల్లా విచారం వ్యక్తం చేశారు. ముఫ్తీ క్షేమంగా బయటపడ్డారని, అయితే ఈ ఘటనలో ఏవైనా భద్రతా లోపాలు వుంటే తక్షణమే వాటిపై దృష్టి పెట్టాలని ఒమర్ అబ్ధుల్లా కోరారు.
Glad to hear that Sahiba escaped injury in what could have been a very serious incident. I expect the government to enquire in to the circumstances of the accident. Any gaps in her security that contributed to this accident must be addressed immediately. https://t.co/ELXb2sHhNt
— Omar Abdullah (@OmarAbdullah)