పరమేశ్వరుడిని వివాహమాడిన యువతి.. జీవితాన్ని శివుడికే అంకితమివ్వాలనే నిర్ణయం..

By Asianet News  |  First Published Jul 25, 2023, 8:29 AM IST

ఓ యువతి తన జీవితాన్ని పరమ శివుడికే అంకితమివ్వాలని ఎవరూ తీసుకోని నిర్ణయం తీసుకుంది. ఆ నీలకంఠుడినే వివాహమాడాలని భావించింది. దీనికి ఆమె తల్లిదండ్రులు కూడా అంగీకరించాడు. సంప్రదాయం ప్రకారం వారిద్దరి పెళ్లి ఆదివారం జరిపించారు.


ఆ యువతికి పరమ శివుడు అంటే ఎంతో భక్తి. ఆయనే తన జీవితం అని భావించింది. ఆ పరమేశ్వరుడి కోసమే తన జీవితాన్ని అంకితం చేయాలని భావించింది. చివరికి నీలకంఠుడినే తన భర్తగా స్వీకరించింది. దీనికి ఆమె కుటుంబ సభ్యులు కూడా అంగీకరించారు. ఈ వివాహకార్యక్రమానికి ఘనంగా ఏర్పాట్లు కూడా చేశారు. ఈ ఘటన యూపీలో ఝాన్సీలో చోటు చేసుకుంది. 

విషాదం.. నిద్రపోతున్న రెండున్నరేళ్ల బాలుడి నోట్లో పడిన బల్లి.. అస్వస్థతతో మృతి

Latest Videos

స్థానికంగా చర్చనీయాంశంగా మారిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఝాన్సీ జిల్లా కేంద్రంలోని అన్నపూర్ణ కాలనీకి చెందిన యువతికి శివుడు అంటే ఎంతో మమకారం. ఎప్పుడూ ఆ భగవంతుడి నామస్మరణలోనే ఉండేది. ఆమె తల్లిదండ్రులకు కూడా చాలా సంవత్సరాల నుంచి ప్రముఖ ఆధ్యాత్మిక సంస్థ అయిన బ్రహ్మకుమారి సంస్థతో అనుబంధం ఉంది. 

వైఎస్ షర్మిలా, విజయమ్మల్లో ఒకరికే ఎంపీ టికెట్ అని చెప్పిన వివేకా - కొమ్మా శివచంద్రారెడ్డి స్టేట్ మెంట్

దీంతో ఆమెకు కూడా సహజంగా ఆధ్యాత్మికతపై ఆసక్తి ఏర్పడింది. ఆమె ఈ బోలా శంకరుడిని ఎక్కువగా ఆరాధించేంది. ఆ భగవంతుడి కోసమే తన జీవితం అని భావించి ఆయననే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని ఆమె తన తల్లిదండ్రులకు తెలిపింది. దీనికి వారు కూడా అంగీకరించారు. ఈ వివాహం కోసం వారే సంప్రదాయబద్ధంగా ఏర్పాట్లు చేశారు. నెల రోజుల ముందు నుంచే ఆహ్వాన పత్రికలు ముద్రించారు. మామూలు వివాహంలాగే చుట్టాలందరికీ పంపించారు. ఆదివారం శాస్త్రోక్తతంగా పరమ శివుడికి, ఆ యువతికి వివాహం చేశారు. పెళ్లి జరిగిన తరువాత విందు కూడా ఏర్పాటు చేశారు.
 

click me!