అంత్యక్రియలకు ఎమ్మెల్యే హాజరుకావాలంటూ లేఖ రాసి కార్మికుడు సూసైడ్.. ఎక్కడంటే ?

By team teluguFirst Published Dec 9, 2022, 11:56 AM IST
Highlights

ఓ కార్మికుడు తనకు ప్రభుత్వం మంజూరు చేసిన భూమికి సంబంధించిన పత్రాలు పొందేందుకు కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే సూసైడ్ నోట్ లో తన అంత్యక్రియలకు స్థానిక ఎమ్మెల్యే తప్పకుండా హాజరుకావాలని పేర్కొన్నాడు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో జరిగింది. 

కర్ణాటక రాష్ట్రంలో ఘోరం వెలుగు చూసింది. తన అంత్యక్రియలకు ఎమ్మెల్యే హాజరుకావాలని కోరుతూ సూసైడ్ నోట్ రాసి ఓ కార్మికుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకరం రేకెత్తించింది. మృతుడి గ్రామంలో విషాదం నింపింది.

వైరల్.. పక్షి చేసిన పని.. రైల్వే ట్రాక్స్ పై విరుచుకుపడిపోయిన టీసీ..

పోలీసులు, అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. తుమకూరు జిల్లా గుబ్బి పట్టణానికి చెందిన మృతుడు 39 ఏళ్ల జయప్రకాష్‌ గ్రానైట్ కార్మికుడిగా పని చేస్తూ ఉండేవాడు. ఆయనకు ప్రభుత్వం ఐదు సంవత్సరాల కిందట భూమి మంజూరు చేసింది. అయితే ఆ భూమి ఆయన పొందాలంటే కొన్ని పత్రాలను తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఆ పత్రాలను పొందేందుకు కొంత కాలం నుంచి తిరుగుతున్నాడు. అప్పులు చేసి తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. 

కానీ పత్రాలు లభించకపోవడంతో తీవ్ర మనస్థాపానికి లోనయ్యాడు. దీంతో అతడు ఆత్మహత్య చేసుకోవాలని భావించాడు. దానికి ముందు ఓ సూసైడ్ నోట్ రాశారు. తన అంత్యక్రియలకు ఎమ్మెల్యే హాజరుకావాలని అందులో కోరాడు. అనంతరం దాబస్‌పేట సమీపంలోని దేవరహోసహళ్లి గ్రామ సమీపంలో ఉన్న సరస్సులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. 

15 స్థానాల్లో నోటా కంటే తక్కువ ఓట్లు.. 126 స్థానాల్లో డిపాజిట్ కోల్పోయిన ఆప్ ..

అతడు సరస్సులో మునిగిపోవడాన్ని బాటసారులు గమనించి దాబస్‌పేట పోలీసులకు సమాచారం అందించారు. వారు జయప్రకాశ్ ను బయటకు తీసుకురావడానికి ప్రయత్నించారు. కానీ అప్పటికే అతడు మరణించాడు. ‘‘మృతుడు దాదాపు ఐదు సంవత్సరాల క్రితం భూమి మంజూరు పత్రాలు అందుకున్నాడు. కానీ ఇతర భూమి హక్కుల ధృవీకరణ పత్రాలు, ఖాటా ఇతర పత్రాలను పొందేందుకు ప్రయత్నించాడు. దీని కోసం అనేక సార్లు సంబంధిత రెవెన్యూ కార్యాలయాలను సందర్శించాడు. కానీ అతడి ప్రయత్నాలు ఫలించలేదు. ’’ అని విచారణ అధికారి తెలిపారు.

ముస్లింలలో బహు భార్యత్వానికి బీజేపీ వ్యతిరేకం - అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ

కాగా.. గుబ్బి ఎమ్మెల్యే ఎస్ ఆర్ శ్రీనివాస్ పట్టణంలో అందుబాటులో లేకపోవడంతో ఆయన భార్య మృతుడి కుటుంబాన్ని కలిసి పరామర్శించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. 

ఆత్మ‌హ‌త్య అన్ని స‌మస్య‌ల‌కు ప‌రిష్కారం కాదు. ఆత్మ‌హ‌త్య‌తో ఎవ‌రూ ఏమీ సాధించ‌లేరు. ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌నే ఆలోచ‌న వ‌స్తే వెంట‌నే 9152987821 అనే ప్ర‌భుత్వ హెల్ప్ లైన్ నెంబ‌ర్ కు కాల్ చేయండి. వారు మంచి కౌన్సిలింగ్ ఇచ్చి మీకు స‌హాయం చేస్తారు. 

click me!