ముస్లింలలో బహు భార్యత్వానికి బీజేపీ వ్యతిరేకం - అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ

By team teluguFirst Published Dec 9, 2022, 10:51 AM IST
Highlights

ముస్లిం సామాజిక వర్గంలో బహుభార్యత్వాన్ని బీజేపీ వ్యతిరేకిస్తోందని అస్సాం సీఎం హిమంత బిశ్వ స్పష్టం చేశారు. హిందువుల తరహాలోనే ముస్లిం పిల్లలు కూడా జనరల్ స్కూల్స్, కాలేజీల్లో చదివి డాక్టర్లు, ఇంజనీర్లు కావాలని తమ ప్రభుత్వం కోరుకుంటుందని అన్నాారు. 

ముస్లిం సామాజిక వర్గానికి చెందిన పురుషులకు బహుళ భార్యలను కలిగి ఉండటాన్ని తమ పార్టీ వ్యతిరేకిస్తుందని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ అన్నారు. ఏఐయూడీఎఫ్ చీఫ్ బద్రుద్దీన్ అజ్మల్ సలహా మేరకు మహిళలు 20 నుంచి 25 మంది పిల్లలకు జన్మనివ్వవచ్చని, అయితే ఆహారం, దుస్తులు, విద్యకు అయ్యే ఖర్చులన్నీ ఆయనే భరించాల్సి ఉంటుందని చెప్పారు. గురువారం ఓ అధికారిక కార్యక్రమంలో సీఎం పాల్గొని మాట్లాడారు. ‘స్వతంత్ర భారతంలో నివసించే పురుషుడికి ముగ్గురు, నలుగురు మహిళలను వివాహం చేసుకునే హక్కు లేదు. అలాంటి వ్యవస్థను మార్చాలనుకుంటున్నాము. ముస్లిం మహిళలకు న్యాయం చేయడానికి మేము కృషి చేయాలి’’ అని చెప్పారు. 

రైలు పట్టాలపై కూర్చుని ప్రేమ కబుర్లు.. ట్రైన్ ఢీ కొట్టడంతో ప్రేమ జంట మృతి..

‘‘ మాకు 'సబ్ కా సాథ్ సబ్ కా వికాస్' కావాలి. అస్సామీ హిందూ కుటుంబాలకు చెందిన వైద్యులు ఉంటే, ముస్లిం కుటుంబాలకు చెందిన వైద్యులు కూడా ఉండాలి. చాలా మంది ఎమ్మెల్యేలు అలాంటి సలహాలు ఇవ్వరు. ఎందుకంటే వారికి 'పోమువా' ముస్లింల ఓట్లు అవసరం’’ అని శర్మ అన్నారు. ( తూర్పు బెంగాల్ లేదా ప్రస్తుత బంగ్లాదేశ్ నుండి ఉద్భవించిన బెంగాలీ మాట్లాడే ముస్లింలను అస్సాంలో 'పోమువా ముస్లింలు' అని పిలుస్తారు.)

అస్సాంలో బద్రుద్దీన్ అజ్మల్ వంటి కొందరు నాయకులు ఉన్నారని ఆయనపై సీఎం మండిపడ్డారు. మహిళలపై అజ్మల్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై హిమంత శర్మ స్పందిస్తూ.. ‘‘మహిళలు తక్కువ వయస్సుల్లో ఉన్నప్పుడు సారవంతమైన భూమి వంటి వారని, ఆ సమయంలోనే వీలైనంత త్వరగా పిల్లలకు జన్మనివ్వాలి అని వారు అంటున్నారు. ఓ మహిళ ప్రసవ ప్రక్రియను ఓ రంగంతో పోల్చలేము ’’ అని సీఎం అన్నారు. ‘‘మన మహిళలు 20-25 మంది పిల్లలకు జన్మనివ్వగలరని నేను పదేపదే చెప్పాను. కానీ వారి ఆహారం, దుస్తులు, విద్య, ఇతర ఖర్చులన్నీ అజ్మల్ భరించాల్సి ఉంటుంది. అప్పుడు, మాకు ఎలాంటి సమస్య లేదు’’ అని శర్మ అన్నారు. పిల్లల ఖర్చులను చెల్లించకపోతే, ప్రసవంపై ఉపన్యాసం ఇచ్చే హక్కు ఎవరికీ లేదని ఆయన అన్నారు.

నెట్ ఫ్లిక్స్ షో ‘ఖాకీ’కి స్ఫూర్తిగా నిలిచిన ఐపీఎస్ అమిత్ లోధాపై అవినీతి కేసు.. ఎందుకంటే ?

అందరికీ ఆహారం, దుస్తులు, విద్యను అందించగల వారు మాత్రమే ఎక్కువ మంది పిల్లలకు జన్మనివ్వాలని, వారిని మంచి మనుషులుగా మార్చాలని సీఎం హిమంత బిశ్వ శర్మ అన్నారు. ‘ మా ప్రభుత్వ విధానం స్పష్టంగా ఉంది. మేము స్థానిక ప్రజల కోసం పని చేస్తాము. కానీ అందరి పురోగతిని కోరుకుంటున్నాము. ముస్లింల విద్యార్థులు, ముఖ్యంగా 'పోమువా' ముస్లింలు మదర్సాలలో చదువుకుని 'జోనాబ్', 'ఇమామ్' కావాలని మేము కోరుకోము’’ అని ఆయన అన్నారు.

పెళ్లి వేడుకల్లో పేలిన గ్యాస్ సిలిండర్.. నలుగురు సజీవదహనం.. 50 మందికి గాయాలు..

ముస్లిం పిల్లలందరూ జనరల్ స్కూల్స్, కాలేజీల్లో అడ్మిషన్ పొంది డాక్టర్లు, ఇంజినీర్లు కావాలని బీజేపీ ప్రభుత్వం కోరుకుంటోందని అన్నారు. కాగా.. డిసెంబర్ 2న ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏఐయూడీఎఫ్ చీఫ్ బద్రుద్దీన్ అజ్మల్ మహిళలపై, లవ్ జీహాద్ పై వివాదాస్పదంగా మాట్లాడారు. దీనికి ప్రతిస్పందిస్తూనే సీఎం ఇలాంటి వ్యాఖ్యలు  చేశారు. 

click me!