సెల్ ఫోన్ పడిపోయిందని మెట్రో ట్రాక్ పై దూకిన మహిళ.. తరువాత ఏమైందంటే ?

By Sairam Indur  |  First Published Jan 2, 2024, 2:12 PM IST

పడిపోయిన సెల్ ఫోన్ ను తీసుకునేందుకు ఓ మహిళ 750 కేవీ విద్యుత్ తో మెట్రో ట్రాక్ పై దూకింది. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. దీని వల్ల మెట్రో సేవలకు పీక్ అవర్స్ లో 15 నిమిషాల అంతరాయం కలిగింది.


మెట్రో పట్టాలపై పడిపోయిన సెల్ ఫోన్ ను తీసుకోవడానికి ఓ మహిళ పెద్ద సాహసానికి ఒడిగట్టింది. ప్రాణాలను కూడా ఫణంగా పెట్టి 750 కేవీ విద్యుత్ సరఫరా ఉండే పట్టాలపై దూకింది. అయితే సిబ్బంది అప్రమత్తం కావడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ఈ ఘటన కర్ణాటక రాజధానిలోని బెంగళూరులో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.

మసీదు బానిసత్వానికి చిహ్నం.. దానిని కూల్చే రామ మందిర నిర్మాణం - కర్ణాటక బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు

Latest Videos

అది బెంగళూరులోని ఇందిరానగర్ మెట్రో స్టేషన్. సోమవారం సాయంత్రం 6.45 గంటల సమయం. అక్కడికి ఓ మహిళ చేరుకుంది. మెట్రో రైలు కోసం ప్లాట్ ఫాం పై ఎదురుచూస్తోంది. ఈ క్రమంలో ఆమె చేతిలో ఉన్న సెల్ ఫోన్ అనుకోకుండా కింద పడి, చివరికి అది పట్టాలపైకి చేరుకుంది. దీంతో ఆమె ఆ సెల్ ఫోన్ ను తీసుకునేందుకు ప్రనయత్నించింది. వెంటనే 750 కేవీ విద్యుత్ ప్రవహించే ఆ మెట్రో పట్టాలపైకి దూకింది.

లీప్ డే ఫిబ్రవరి 29నే ఎందుకు వస్తుంది? లీప్ ఇయర్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

దీనిని అక్కడే విధుల్లో ఉన్న భద్రతా సిబ్బంది గమనించారు. ఈ విషయాన్ని వెంటనే కంట్రోల్ రూమ్ కు సమాచారం అందించారు. అప్రమత్తమైన అధికారులు వెంటనే విద్యుత్ సరఫరా నిలిపివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో తన సెల్ ఫోన్ తీసుకొని పైకి లేచింది. తోటి ప్రయాణికుడి సాయంతో తిరిగి ప్లాట్ ఫాంపైకి వచ్చింది. భద్రతా సిబ్బంది ఆమె వద్దకు చేరుకొని ఇక ప్రమాదం తప్పిందని నిర్ధారించారు.

ఏసియానెట్ ఎక్స్ క్లూజివ్ : అయోధ్య ఎంత అద్భుతంగా మారిపోయిందో చూడండి.. (వీడియో)

ఈ ఘటనపై బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఏఎస్ శంకర్ మాట్లాడుతూ.. ఆ మహిళను ముఖం సీసీటీవీ ఫుటేజీలో రికార్డయిందని చెప్పారు. భవిష్యత్తులో ఆమె ఏ స్టేషన్లోకి ప్రవేశించినా పట్టుకుంటామని తెలిపారు. 

click me!