
ఆ దంపతులకు కొన్నేళ్ల కిందట వివాహం జరిగింది. ముగ్గురు పిల్లలు. అయితే కొంత కాలం నుంచి భార్య భర్తల మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో వేరు వేరుగా జీవించాలని నిర్ణయించుకున్నారు. దాని ప్రకారమే ఇద్దరూ చెరో చోట బతుకుతున్నారు. పిల్లలు తండ్రి వద్దే ఉంటున్నారు. ఈ క్రమంలో భర్త మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం తెలియడంతో మొదటి భార్య కోపంతో ఊగిపోయింది. భర్త, అతడి రెండో భార్య, పిల్లలు అందరూ నిద్రిస్తున్న సమయంలో ఇంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లాలో చోటు చేసుకుంది.
పెళ్లైన నెలన్నరకే.. భార్య నాలుగు నెలల గర్భవతి.. షాక్ అయిన వరుడు ఏం చేశాడంటే...
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రైల్వేకోడూరు పట్టణానికి చెందిన స్వామి నాయక్, లక్ష్మి బాయిలకు కొన్ని సంవత్సరాల కిందట వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. కొంత కాలం పాటు సాఫీగా సాగిన వీరి వైవాహిక జీవితంలో గొడవలు ప్రారంభమయ్యాయి. భర్త తన భార్యపై అనుమానం పెంచుకున్నాడు. దీంతో వీరి మద్ద తరచూ గొడవలు జరిగేవి. వీరు పోలీసు స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసుకున్నారు.
ఈ క్రమంలో విడివిడిగా ఉండాలని నిర్ణయించుకున్నారు. పిల్లలు తండ్రి వద్ద ఉంటుండగా.. తల్లి లక్ష్మిబాయి విడిగా ఉంటోంది. ఇటీవలి కాలంలో స్వామి నాయక్ మరో మహిళను వివాహం చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న లక్ష్మిబాయి ఆగ్రహంతో రెచ్చిపోయారు. గురువారం అర్ధరాత్రి సమయంలో పిల్లలు, తన భర్త, రెండో భార్య ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఆ ఇంటి సమీపంలోకి చేరుకుంది. భర్తపై, రెండో భార్యపై పెట్రోల్ పోసింది. అనంతరం నిప్పు పెట్టింది. దీంతో ఇంటికి కూడా నిప్పంటుకుంది. భర్త, అతడి రెండో భార్యకు అలాగే కుమారుడికి కూడా ఈ మంటల వల్ల గాయాలు అయ్యాయి. వీరందిరినీ వెంటనే స్థానికులు తిరుపతిలోని రూయా హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అక్కడ ప్రస్తుతం వీరంతా చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ కేసులో దర్యాప్తు జరుపుతున్నామని రైల్వేకోడూరు ఎస్‌ఐ వెంకటనరసింహం తెలిపారు.