పెళ్లైన నెలన్నరకే.. భార్య నాలుగు నెలల గర్భవతి.. షాక్ అయిన వరుడు ఏం చేశాడంటే...

Published : Jun 18, 2022, 07:51 AM IST
పెళ్లైన నెలన్నరకే.. భార్య నాలుగు నెలల గర్భవతి.. షాక్ అయిన వరుడు ఏం చేశాడంటే...

సారాంశం

ఉత్తరప్రదేశ్ లో ఓ షాకింగ్ ఘటన జరిగింది. పెళ్లైన నెలన్నరకే భార్య గర్భవతి అయ్యింది. అయితే నాలుగు నెలల గర్భిణీ అని తేలడంతో భర్త, కుటుంబసభ్యులు షాక్ అయ్యారు. ఆమె మోసం చేసిందంటూ భర్త పీఎస్ లో ఫిర్యాదు చేశాడు.  

ఉత్తర ప్రదేశ్ :  నవ వధువు Four months pregnant కావడంతో భర్త, అత్తమామలు షాక్‌కు గురైన ఘటన uttarpradesh రాష్ట్రంలో వెలుగు చూసింది. ఉత్తరప్రదేశ్లోని మహారాజ్గంజ్ లో నవవధువు నాలుగు నెలల గర్భవతి అని తెలియడంతో అత్తమామలు, భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. Newlywed bride కడుపు నొప్పి గురించి ఫిర్యాదు చేయడంతో వైద్యులకు చూపించగా ఆమె నాలుగు నెలల గర్భిణీ గా తేలింది. నవవధువు పెళ్లై ఒకటిన్నర నెలలు మాత్రమే అయింది. ఆమెకు కడుపునొప్పి రావడంతో సోనోగ్రఫీ పరీక్షలు చేయగా ఆమె గర్భిణి అని ఆమె అత్తమామలకు తెలిసింది. 

దీంతో వారు కోడలిని ఇంటికి తీసుకు వెళ్లేందుకు నిరాకరించారు. నవ వధువు  భర్త పోలీస్ స్టేషన్లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు.  ఓ బంధువు మధ్యవర్తిత్వంతో పొరుగు జిల్లాకు చెందిన యువతితో నెలన్నర క్రితం ఈ వివాహం జరిగింది. నవవధువు తమను మోసం చేసిందని భర్త అతని కుటుంబ సభ్యులు ఆరోపించారు. గర్భం దాల్చిన విషయం అమ్మాయి తరఫు వారికి ముందే తెలుసునని.. అయితే నిజం దాచిపెట్టారని భర్త ఆరోపించాడు. ఈ కేసును క్షుణ్ణంగా విచారిస్తున్నట్లు పోలీసు అధికారి అభిషేక్ సింగ్ తెలిపారు.

మేనకోడలిపై వ్యాపారి అత్యాచారం.. అండర్ వరల్డ్ డాన్ తో చంపిస్తానంటూ బెదిరింపులు..

కాగా, జూన్ 15న ఆంధ్రప్రదేశ్ లోని క్రిష్ణా జిల్లాలో ఓ నవవధువు ఆత్మహత్యకు పాల్పడింది. పెళ్లయిన 4 నెలలకే ఆమెకు నూరేళ్లు నిండాయి. cellphone కారణంగా జరిగిన గొడవ newly married woman ప్రాణాలు బలితీసుకుంది. కలుపు మందు తాగి చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది.  కృష్ణాజిల్లా తోట్లవల్లూరు మండలం భద్రిరాజుపాలెంలో జరిగిన ఈ ఘటన ఇరు కుటుంబాల్లో విషాదం నింపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  భద్రిరాజుపాలెం గ్రామానికి చెందిన వల్లూరు యోహాను, మరియమ్మ దంపతుల చిన్న కుమార్తె రత్నకుమారి (19)ను ఉంగుటూరు మండలం నందమూరు గ్రామానికి చెందిన పేటేటి సన్నీకి ఇచ్చి ఈ ఏడాది ఫిబ్రవరి 18న వివాహం చేశారు. సన్నీ వ్యవసాయ పనుల రీత్యా భద్రిరాజుపాలెంలోని అత్తగారి ఇంట్లోనే ఉంటున్నాడు. 

ఈనెల 13న సెల్ఫోన్ కారణంగా రత్నకుమారితో చిన్న గొడవ జరిగింది.  దీంతో మనస్తాపం చెందిన రత్నకుమారి ఇంటి ఆవరణలో ఉన్న కలుపు మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.  అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం  మృతి చెందింది. రత్నకుమారి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పెళ్లై నాలుగు నెలలు కూడా నిండకముందే మృతిచెందడంతో ఇరు కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి. రత్నకుమారి ఇటీవల ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు కూడా రాసినట్లు తెలిసింది. మృతురాలి తండ్రి యోహాను ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అర్జున్ తెలియజేశారు. 

PREV
click me!

Recommended Stories

Palamedu Jallikattu Begins in Madurai: తమిళనాడులో హోరా హోరీగా జల్లికట్టు| Asianet News Telugu
JIO : తక్కువ ధరకే 200 జీబీ డేటా.. జియో అద్భుత రీచార్జ్ ప్లాన్