స్నేహితుడి కుతూరిపై అత్యాచారం.. గర్భం దాల్చిన చిన్నారి.. కామాంధుడికి సహకరించిన భార్య.. 

Published : Aug 20, 2023, 01:08 PM IST
స్నేహితుడి కుతూరిపై అత్యాచారం.. గర్భం దాల్చిన చిన్నారి.. కామాంధుడికి సహకరించిన భార్య.. 

సారాంశం

దేశ రాజధాని ఢిల్లీలో ఓ దారుణం వెలుగులోకి వచ్చింది. ఉన్నత స్థాయిలో ఉన్న ప్రభుత్వ అధికారి అతడి స్నేహితుడి కుతూరిపై కన్నేశాడు. ఆ చిన్నారికి మాయ మాటలు చెప్పి.. కడుపు చేశాడు. ఆ చిన్నారి గర్భంలో తొలగించడంలో ఆ కామాంధుడు భార్య కూడా సహకరించింది. ఆ చిన్నారి జరిగిన విషయం తన తల్లికి చెప్పడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. 

ఆడ పిల్ల పుట్టిందంటే ఇంటి లక్ష్మిదేవి వచ్చిందని సంతోషపడే వాళ్ళు. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. ఆ బిడ్డ తల్లిదండ్రులు భయంతో వణికి పోతున్నారు. తమ చిన్నారిపై ఏ కామాంధుడు కన్నేస్తాడో.. బిడ్డ జీవితం ఎవరి చేతిలో నలిగి పోతుందో అని ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలను అమలు చేస్తున్నా.. కామాంధుల బుద్ది మారడం లేదు.

తమ కామావాంఛ తీర్చుకోవడానికి.. చిన్నా, పెద్ద, ముసలి, ముతక అనే తేడా లేకుండా.. వరుసలు మరచి పశువులు లాగా రెచ్చిపోతున్నారు. ఆడపిల్ల కనబడితే.. చాలు మ్రుగాళ్ల ప్రవర్తిస్తున్నారు. దారుణ శిక్షలు వేస్తున్నా కూడా కామంధులు వెనక్కి తగ్గడం లేదు. రోజుకో ఎంతోమంది అమాయకపు అమ్మాయిలు బలవుతున్నారు. ఉన్నతస్థాయిలో ఉన్న ఓ ప్రభుత్వ అధికారి తన స్నేహితుడి 14 ఏళ్ల కూతురిపై కన్నేశాడు. ఆ మైనర్ బాలికకు మయమాటలు చెప్పి.. గత కొన్ని నెలలుగా అత్యాచారం చేస్తున్నాడు. తన కామావాంఛ తీర్చుకుంటున్నాడు. ఈ క్రమంలో ఆ చిన్నారి గర్భం దాల్చితే.. ఆ కామాంధుడి భార్య ఆ గర్భాన్ని తొలగించడంతో సహాయం చేసింది.  ఈ దారుణమైన  ఘటన దేశరాజధాని ఢిల్లీలో వెలుగులోకి వచ్చింది. 

పోలీసులు అందిన సమాచారం ప్రకారం.. బాధిత బాలిక 12వ తరగతి విద్యార్థిని. ఆ చిన్నారి 2020 లో తన తండ్రిని కోల్పోయింది. ఈ క్రమంలో తన తండ్రి స్నేహితుడు ఆ చిన్నారిపై కన్నేశాడు. తరుచు  నిందితుడు ఆ చిన్నారి వచ్చేవాడు.  వారి కుటుంబ బాగోగులు తెలుసుకోవడం, ఏదైనా అవసరం వస్తే.. ముందుండి తానే చూసుకోవడం వంటి చేసేవాడు. దీంతో ఆ కుటుంబం ఆ కామాంధుడ్ని పూర్తిగా నమ్మింది. అప్పుడప్పుడు ఆ చిన్నారిని తన ఇంటికి తీసుకెళ్లేవాడు.  ఆ చిన్నారికి ఏ అవసరం ఉన్న అతడే తీర్చేవాడు. ఈ క్రమంలో ఆ చిన్నారికి మాయమాటలు చెప్పుతూ..  
అత్యాచారానికి పాల్పడేవాడు. ఇలా ఆ కామాంధుడు ఆ మైనర్‌పై 2020 నుంచి 2021 మధ్య పలుమార్లు అత్యాచారం చేశాడు. దీంతో ఆ చిన్నారి గర్భం దాల్చింది. ఈ విషయాన్ని ఆ  నిందితుడు తన భార్యకు చెప్పాడు.ఆ మహా తల్లి కూడా ఆ కామాంధుడికే సహకరించింది. ఆ చిన్నారికి తెలియకుండా.. గర్బం నిరోధక మాత్రలు వేసింది. అలా ఆ చిన్నారికి అబార్షన్ చేయించింది.  ఈ చిన్నారి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

బాలిక ప్రస్తుతం చికిత్స పొందుతోంది. ఆమె వాంగ్మూలాన్ని మేజిస్ట్రేట్ ముందు నమోదు చేయాల్సి ఉంది. ఉన్నతాధికారిపై వచ్చిన తీవ్ర ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు విచారణ జరుపుతున్నారు. నిందితుడు ఢిల్లీ ప్రభుత్వ మహిళా, శిశు అభివృద్ధి శాఖ సీనియర్ అధికారిగా గుర్తించారు.బాలికపై అత్యాచారం కేసును దర్యాప్తు చేసేందుకు ఢిల్లీ పోలీసులు ఆ సీనియర్ అధికారిపై ఇండియన్ పీనల్ కోడ్, పోక్సో చట్టంలోని అనేక సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసులో అధికారి భార్య కూడా చిన్నారిపై అత్యాచారానికి సహకరించినట్లు ఆరోపణలు వచ్చాయి.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Modi speech at the African Parliament:భారత్–ఇథియోపియా సంబంధాల్లో కొత్త అధ్యాయం | Asianet News Telugu
Reliance Jio : అంబానీ మామ న్యూఇయర్ గిప్ట్ ...జియో యూజర్స్ కి రూ.35,100..!