మెడలో గొలుసు లాక్కునేందుకు మహిళను ఆటో నుంచి ఈడ్చుకెళ్లిన దుండగులు.. గాయాలతో బాధితురాలు మృతి

Published : Oct 28, 2022, 09:39 AM IST
మెడలో గొలుసు లాక్కునేందుకు మహిళను ఆటో నుంచి ఈడ్చుకెళ్లిన దుండగులు.. గాయాలతో బాధితురాలు మృతి

సారాంశం

ఢిల్లీలో ఓ మహిళ పట్ల ఇద్దరు దొంగలు దారుణంగా ప్రవర్తించారు. మెడలో నుంచి గొలుసును లాక్కునేందుకు ఆమెను ఆటో నుంచి కింద పడేసి కొంత దూరం ఈడ్చుకెళ్లారు. దీంతో తీవ్ర గాాయాలపాలైన బాధితురాలు చికిత్స పొందుతూ మరణించారు. 

ఢిల్లీలోని ప్రశాంత్ విహార్ ప్రాంతంలో దారుణం జరిగింది. ఓ ఆటోలో ప్రయాణిస్తున్న 56 ఏళ్ల మహిళ మెడలో బంగారు గొలుసు లాక్కునేందుకు ఇద్దరు దుండుగులు ప్రయత్నించారు. ఈ క్రమంలో జరిగిన తోపులాటలో ఆమె కిందపడిపోయింది. అయినా వదలకుండా కొంత దూరం నేలపైనే ఆమెను ఈడ్చుకెళ్లారు. అనంతరం బ్యాగ్, గొలుసు చోరీ చేసుకుని వెళ్లారు. తీవ్ర గాయాలపాలైన బాధితురాలు హాస్పిటల్ లో చనిపోయారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

ఇండియా-పాక్ బార్డర్ లో ఆయుధాల పట్టివేత.. ఏకే-47 రైఫిల్స్, పిస్టల్స్, బుల్లెట్లను స్వాధీనం చేసుకున్న బీఎస్ఎఫ్

వివరాలు ఇలా ఉన్నాయి. ప్రశాంత్ విహార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రోహిణి సెక్టార్ 14 ప్రాంతంలో అక్టోబర్ 26వ తేదీన సుమిత్రా మిట్టల్ (56)  ఆటోలో ప్రయాణిస్తోంది. ఆ సమయంలో ఇద్దరు దుండగులు బైక్ వచ్చారు. ఆమె వద్ద బ్యాగ్, మెడలో బంగారు గొలుసును గమనించారు. ఆటో పక్క నుంచి బైక్ ను పోనిస్తూ.. ఒక్క సారిగా బ్యాగ్ ను, అలాగే మెడలో నుంచి గొసులును లాక్కున్నారు. ఈ తోపులాట వల్ల మహిళ కింద పడిపోయింది. ఈ క్రమంలో ఆమెను కొంత వరకు దుండగులు ఈడ్చుకెళ్లారు. 

అనంతరం నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనలో మహిళకు తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు ఆమెను రోహిణి సెక్టార్‌-13లోని భారత్‌ అపార్ట్‌మెంట్‌ సమీపంలోని భగవతి హాస్పిటల్ లో చేర్చారు. అయితే అక్కడ చికిత్స పొందుతున్న సమయంలోనే పరిస్థితి విషమించడంతో ఆమె మరణించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఘటన జరిగిన ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా నిందితులు ఎవరన్నది గుర్తించారు. ఇద్దరు నిందితులను, వారి స్నేహితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని పట్టుకునేందుకు ఢిల్లీ పోలీసులు 15 బృందాలను ఏర్పాటు చేశారు.

దారుణం.. టీ తాగి ఐదుగురి మృతి.. చాయ్ పత్తా అనుకుని అది కలపడం వల్లే...

అరెస్టు అయిన దుండగులను సెక్టార్-18కి చెందిన రాజు, రోహన్, రోహిణి, రాహుల్‌గా గుర్తించామని పోలీసులు తెలిపారు. ఈ దొంగతనానికి ఉపయోగించిన బైక్ ను కూడా నిందితులు బద్లీ ప్రాంతంలో చోరీ చేశారు. అయితే ఆ మహిళ నుంచి లాక్కున్న బ్యాగ్ లో ఇంటి తాళాలు, రూ.200 మాత్రమే ఉన్నాయి. వాటిని స్వాధీనం చేసుకున్నామని డిప్యూటీ కమిషనర్ తెలిపారు. రాహుల్ గతంలో రెండు క్రిమినల్ కేసుల్లో ప్రమేయం ఉన్నట్లు పేర్కొన్నారు.

ఒడిశాలో దారుణం.. మహిళపై విచక్షణ రహితంగా దాడి.. 33 మంది అరెస్టు

ఈ ఘటనకు సంబంధించి ప్రశాంత్ విహార్ పోలీస్ స్టేషన్‌లో ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) సెక్షన్‌లు 397 (దోపిడీ, హత్యాయత్నం లేదా ఘోరంగా గాయపరిచే ప్రయత్నం), 302 (హత్య) కింద కేసు నమోదు చేశారు.  కాగా.. ఢిల్లీ పోలీసుల డేటా ప్రకారం.. 2022 జూలై వరకు స్నాచింగ్ కేసుల్లో 12 శాతం, ప్రాణాంతక ప్రమాదాల్లో 18 శాతం పెరుగుదల నమోదైంది. గతేడాది ఢిల్లీలో 5,024 స్నాచింగ్‌ కేసులు, 4,468 ప్రమాదాలు జరిగాయి.

PREV
click me!

Recommended Stories

యువతకు బంపరాఫర్ ... 2026లో లక్షన్నర ప్రభుత్వ కొలువులు
భారత్–ఒమన్ వ్యాపార వేదికలో మోదీ కీలక వ్యాఖ్యలు | India–Oman Business Forum | Asianet News Telugu