దారుణం.. టీ తాగి ఐదుగురి మృతి.. చాయ్ పత్తా అనుకుని అది కలపడం వల్లే...

Published : Oct 28, 2022, 07:32 AM IST
దారుణం.. టీ తాగి ఐదుగురి మృతి.. చాయ్ పత్తా అనుకుని అది కలపడం వల్లే...

సారాంశం

ఉత్తరప్రదేశ్ లో విషాద ఘటన జరిగింది. టీ తాగిన ఐదుగురు మృత్యువాత పడ్డారు. ఇందులో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. 

ఉత్తర ప్రదేశ్ : ఉత్తరప్రదేశ్లోని మెయిన్ పురిలో  విషాదం చోటు చేసుకుంది. ఓ ఇల్లాలు చేసిన పొరపాటు పనికి ఐదు నిండు ప్రాణాలు బలి అయిపోయాయి. ఇంట్లో టీ తాగిన తర్వాత తీవ్ర అస్వస్థతకు గురై ఇద్దరు చిన్నారులతో పాటు ఐదుగురు మృతి చెందిన ఘటన నాగ్లా కన్హై గ్రామంలో గురువారం జరిగినట్టు ఎస్పీ కమలేష్ దీక్షిత్ వెల్లడించారు. ఈ ఘటనపై ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. శివానందం (35), అతడి కుమారులు శివాంగ్ (6),  దివ్యాన్ష్ (5), మామ రవీంద్ర సింగ్ (55)  పొరుగింటి వ్యక్తి  సోబ్రాన్ (45) ఇంట్లో టీ తాగిన తర్వాత తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.  

వీరందరిని జిల్లా ఆస్పత్రికి తరలించగా అప్పటికే రవీంద్ర సింగ్, శివాంగ్, దివ్యాన్ష్ లు ప్రాణాలు విడిచినట్టు వైద్యులు ధ్రువీకరించారు. సోబ్రాన్, శివానందన్ ల ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో వారిని సైఫాయి ఆస్పత్రికి తరలించగా అక్కడ వారి ఇద్దరు ప్రాణాలు విడిచారు. అయితే, శివానందన్ భార్య వరి పంటలో పిచికారీ చేసే మందును పొరపాటున టీ పొడి అనుకుని కలిపేయడంతో అది విషపూరితమై ఈ పెను విషాదాన్ని కారణమైనట్లు తన ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు ఎస్పి తెలిపారు.

ఒడిశాలో దారుణం.. మహిళపై విచక్షణ రహితంగా దాడి.. 33 మంది అరెస్టు

ఇదిలా ఉండగా, ఇలాంటి ఘటన నిరుడు మార్చిలో తెలంగాణ లోని జనగామ జిల్లాలో చోటు చేసుకుంది. బచ్చన్నపేట మండలం రామచంద్రాపురంలో మార్చి 31న ఈ విషాద ఘటన వెలుగులోకి వచ్చింది. విషం కలిసిన టీ తాగి ఒక మహిళ మృతి చెందగా, ఇద్దరి పరిస్థితి విషమంగా మారింది. ఎండ్రిన్‌ గుళికలను టీ పొడి అనుకుని దాంతో అంజమ్మ అనే మహిళ టీ కాచింది. ఈ టీని అంజమ్మతో పాటు భర్త మల్లయ్య, మరిది భిక్షపతి తాగారు. కాగా టీ తాగిన వెంటనే అంజమ్మ మృతి చెందగా, అంజమ్మ భర్త మల్లయ్య, మరిది భిక్షపతి పరిస్థితి విషమంగా ఉంది. 

PREV
click me!

Recommended Stories

Delhi dust storm: ఢిల్లీలో ఇసుక తుఫాను బీభత్సం | Massive Sandstorm Hits Delhi-NCR | Asianet Telugu
Vijay vs Udhayanidhi: తమిళనాడు అసెంబ్లీలో రచ్చసీఎం విజయ్ vs ఉదయనిధి | Asianet News Telugu