దారుణం.. తాగేందుకు డబ్బులివ్వలేదని కన్నతల్లినే కడతేర్చిన తనయుడు.. ఎక్కడంటే ?

By team teluguFirst Published Oct 29, 2022, 11:55 AM IST
Highlights

తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని ఓ కుమారుడు కన్నతల్లిని కర్రతో బాది చంపేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బిజ్నోర్ లో చోటు చేసుకుంది. 

మద్యం ఎన్నో అనార్థాలకు దారి తీస్తుంది. మద్యపానం వల్ల ఎంతో మంది జీవితాలు నాశనం అయిపోతున్నాయి. మనిషి ఆలోచన శక్తిని తగ్గిస్తున్నాయి. విచక్షణా జ్ఞానాన్ని తగ్గిస్తోంది. అనేక సమస్యలకు కారణం అవుతోంది. మద్యం సేవించి విచక్షణ కోల్పోయి, ఆ మత్తులో ఎన్నో ఘటనలకు పాల్పడుతున్నారు. అత్యాచారాలు, హత్యలు చేస్తున్నారు. సొంత వారినే కడతేరుస్తున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్ లో కూడా ఇలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది.

మొయినాబాద్‌ ఫామ్ హౌజ్‌ కేసు: పోలీసుల పిటిషన్‌ను తోసిపుచ్చిన హైకోర్టు.. వివరాలు ఇవే..

తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని ఓ కుమారుడు సొంత తల్లినే చంపేశాడు. ఈ దారుణం యూపీలోని బిజ్నోర్ జిల్లా చాంద్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లేపురి గ్రామంలో జరిగింది. ఆ గ్రామం సముద్రాదేవీని అనే 65 ఏళ్ల వృద్ధురాలు నివసిస్తున్నారు. ఆమెకు 25 ఏళ్ల దేవేంద్ర సైనీ అనే కుమారుడు ఉన్నాడు. గత కొంత కాలంగా అతడు మద్యానికి బానిస అయ్యాడు.

కొమ్ము కోయ కళాకారులతో డ్యాన్సు చేసిన రాహుల్ గాంధీ.. (వీడియో)

తాగి వచ్చి తరచూ కుటుంబ సభ్యులను వేధించేవాడు. గొడవలు చేసేవాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి సైనీ తన తల్లి వద్దకు వచ్చాడు. మద్యం కొనేందుకు తనకు డబ్బులు ఇవ్వాలని కోరాడు. దీంతో తల్లి మందలించింది. దీంతో కోపం తెచ్చుకున్న కుమారుడు ఆమెతో గొడవ పడ్డాడు. ఇలా గొడవ పడుతున్న సమయంలో క్షణికావేశంలో తల్లిని చెక్క కర్రతో తీవ్రంగా కొట్టాడు. దీంతో సముద్రాదేవి చనిపోయింది. 

ఛఠ్ పూజ వేళ సిలిండర్లు పేలి ఎగిసిపడ్డ మంటలు, 30 మందికి గాయాలు...

ఈ ఘటనపై కుటుంబ సభ్యులు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకొని హత్య కేసు నమోదు చేశారు. అనంతరం నిందితుడిని అరెస్టు చేశారు. అతడిపై ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 302 (హత్య) కింద కేసు నమోదు చేసినట్లు అదనపు పోలీసు సూపరింటెండెంట్ రామ్ అర్జ్ తెలిపారు. పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా మార్చురీకి తరలించారు.

click me!