రైల్లో ప్రయాణికులకు ఫ్రీ షవర్... నెట్టింట వీడియో వైరల్..!

By telugu news teamFirst Published Oct 29, 2022, 11:23 AM IST
Highlights

రైల్వే స్టేషన్ లో ఒక ట్యాప్ పాడవ్వడం వల్ల... దాని నుంచి వచ్చే నీరు.. షవర్ లా అందరినీ తడిపేసింది. ప్లాట్ ఫామ్ పై వెళ్తున్న రైలు, రైల్లోని ప్రయాణికులను కూడా తడిపేసింది. 

రైల్వో ప్రయాణికులకు ఫ్రీ షవర్ సదుపాయం కల్పించారు. రైల్వే స్టేషన్ లో అది కూడా ట్రైన్ లో ఫ్రీ షవర్ ఏంటా అని ఆశ్చర్యం కలుగుతోందా..? నిజానికి అది షవర్ కాదు.. కానీ ప్రయాణికులకే అదే అనుభవం కలిగింది. రైల్వే స్టేషన్ లో ఒక ట్యాప్ పాడవ్వడం వల్ల... దాని నుంచి వచ్చే నీరు.. షవర్ లా అందరినీ తడిపేసింది. ప్లాట్ ఫామ్ పై వెళ్తున్న రైలు, రైల్లోని ప్రయాణికులను కూడా తడిపేసింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇది పశ్చిమ బెంగాల్ లో చోటుచేసుకున్నట్లు సమాచారం.

 

Indian railways at your service 😂 pic.twitter.com/fEL65NFjHs

— Abhy (@craziestlazy)

Indian railways at your service 😂 pic.twitter.com/fEL65NFjHs

— Abhy (@craziestlazy)

 ఈ వీడియోని ‘ ఇండియన్ రైల్వేట ఎట్ యువర్ సర్వీస్’ అనే క్యాప్షన్ తో షేర్ చేయడం గమనార్హం. ఈ వీడియోకి   1.1 మిలియన్లకు పైగా వ్యూస్ రాగా... 26,000 కంటే ఎక్కువ లైక్‌లు రావడం గమనార్హం.

వీడియో 30-సెకన్లు ఉండగా... ఫుటేజీలో, పగిలిన కుళాయి నుండి నీరు ఫిరంగిలాగా పూర్తి శక్తితో బయటకు రావడం కనపడుతోంది. కొద్దిసేపటి తర్వాత, కెమెరా ఇన్‌కమింగ్ రైలు వైపు ప్యాన్ చేయడంతో, ప్రయాణిస్తున్న లోకల్ ట్రైన్ డోర్ దగ్గర నిలబడి ఉన్న ప్రయాణికులు ఆ నీటిలో తడవడం గమనార్హం. నీళ్లు మీద పడగానే వెంటనే లోపలికి పరిగెత్తిన వారు కూడా ఉన్నారు.

 ఈ వీడియో వైరల్ గా మారడంతో పాటు.... కామెంట్ల వర్షం కురుస్తోంది. కామెంట్లు చూస్తే మరింతగా నవ్వుకుంటారు. కులాయ్ కి కోపం వచ్చిందని.... ఆ కోపం నుంచి ప్రయాణికులు కూడా తప్పించుకోలేకపోయారని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. మరొకరేమో.. ఇది రైల్వే అందించిన స్పెషల్ సేవ అని వెటకారంగా రాశారు. మరొకరు.. ప్రయాణికులు చాలా మంది ఉదయాన్నే స్నానం చేయరని.. ఇలా ప్లాన్ చేశారంటూ కామెంట్ చేయడం గమనార్హం. మరొకరేమో.. ఇది ఆటో క్లీనింగ్ సిస్టమ్ అని పేర్కోవడం గమనార్హం.

click me!