దారుణం.. కోడ‌లుకు ఆస్తిలో వాటా ఇచ్చారని త‌ల్లిని కాల్చి చంపిన కుమారుడు..

Published : Mar 05, 2022, 02:44 PM IST
దారుణం.. కోడ‌లుకు ఆస్తిలో వాటా ఇచ్చారని త‌ల్లిని కాల్చి చంపిన కుమారుడు..

సారాంశం

ఉత్తరప్రదేశ్ లో దారుణం జరిగింది. కోడలుకు ఆస్తిలో ఇచ్చారని ఆందోళన చెందిన ఓ వ్యక్తి తని తల్లిని గన్ తో కాల్చి చంపేశాడు. తండ్రిని కూడా తీవ్రంగా గాయపరిచాడు. ఈ ఘటన  ఫ్రిబ్రవరి 27వ తేదీన జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

న‌వ మాసాలు మోసి క‌ని, పెంచిన త‌ల్లిని కాల్చి చంపి కసాయిగా మారాడు ఆ కుమారుడు. ఆస్తి పంప‌కాల్లో త‌న‌కు బ‌దులుగా కోడలుకు వాటా ఇచ్చార‌నే కోపంతో ఈ దారుణానికి ఒడిగ‌ట్టాడు. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్ (uttar pradesh) లో జ‌రిగింది. ఈ కేసును ఛేదించిన పోలీసులు వివ‌రాలు వెల్ల‌డించారు. 

పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని బులంద్‌షహర్ (Bulandshahr) జిల్లా  ఖుర్జా (Khurja) ప్రాంతానికి చెందిన య‌తేంద్ర కు ఇద్ద‌రు సోద‌రులు ఉన్నారు. తండ్రి ఓం ప్ర‌కాశ్ (om prakash)కు అర్నియా ప్రాంతంలో పూర్వీకుల భూమి ఉంది. దానిని తండ్రి విక్ర‌యించ‌డంతో రూ.12 ల‌క్ష‌లు వ‌చ్చాయి. అయితే వీటిని వాటాలు చేసి ఇద్ద‌రు సోద‌రులకు ఇచ్చేశారు. అయితే అత‌ని వాటా మాత్రం సోద‌రుడి జితు భార్య‌కు ఇచ్చాడు. దీంతో య‌తేంద్ర ఆందోళ‌న చెందాడు. 

త‌న వాటా కూడా ఎక్క‌డ కోడ‌లుకు ఇచ్చేస్తాడో అని య‌తేంద్ర (Yatendra) భ‌య‌ప‌డ్డాడు. అత‌డిలో అభ‌ద్ర‌తా భావం నెల‌కొంది. దీంతో త‌ల్లిదండ్రుల‌ను హ‌త్య చేయాల‌ని ప్లాన్ చేశాడు. ఫిబ్ర‌వ‌రి 27వ తేదీన బాల్కినిలో నిద్రిస్తున్న త‌ల్లి మంజు (manju)ను అత‌డు గ‌న్ తో కాల్చి చంపాడు. తండ్రిని కూడా తీవ్రంగా గాయ‌పర్చాడు. ఈ విష‌యంలో పోలీసుల‌కు తెలియ‌డంతో నిందితుడిని ఖుర్జా జంక్షన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆస్తిపై ఆశ‌తోనే త‌ల్లిపై నిందితుడు కాల్పులు జ‌రిపార‌ని పోల‌సులు తెలిపారు. 

ఘ‌ట‌న స్థలం నుంచి పోలీసులు ఆయుధాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. విమ్లా నగర్‌కు చెందిన మంజును ఆమె కుమారుడు హత్య చేసినట్లు ఎస్‌హెచ్‌ఓ నీరజ్ సింగ్ చెప్పారు. ఇంట్లోకి బ‌య‌టి వ్య‌క్తులు ఎవ‌రూ ప్ర‌వేశించ‌లేద‌ని అన్నారు. నిందితుడిని ప్రశ్నించ‌గా త‌నే త‌ల్లిని హ‌త్య చేశాన‌ని ఒప్పుకున్నార‌ని తెలిపారు. తండ్రిని తీవ్రంగా గాయపరిచినట్లు అంగీకరించాడని సింగ్ చెప్పారు.

గతేడాది నవంబర్ లో ఆంధ్రప్రదేశ్ (andrapradesh) లోని మచిలీపట్నం (machilipatnam) లో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. తన పెళ్లి చేయడం లేదని  తల్లితో గొడవపడి చివరికి క్రికెట్ బ్యాట్ తో కొట్టి చంపాడు. వివరాలు ఇలా ఉన్నాయి. మచిలీపట్నం పరాస్ పేటలోని శ్రీచైతన్య టెక్నో స్కూల్ సమీపంలో చింతరాజు - వెంకటేశ్వరమ్మ (chintharaju venkateshwaramma) దంపతులు కొడుకు హరీష్ రావు (harish rao)తో కలిసి నివాసముటున్నారు. అయితే హరీష్ తనకు పెళ్లి చేయాలంటూ తల్లిదండ్రులను ఒత్తిడి చేయడంతో వారు సంబంధాలు చూస్తున్నారు. బంధువులతో పాటు తెలిసినవారి ద్వారా చాలా సంబంధాలు వచ్చాయి. కానీ ఏ సంబంధమూ పెళ్లివరకు వెళ్లలేదు. కొంతకాలంగా ఇలాగే సంబంధాలు రావడం... పెళ్లి కుదరకపోవడంతో హరీష్ డిప్రెషన్ కు గురయ్యాడు. దీంతో తరచూ తల్లిదండ్రులతో గొడవపడుతుండేవాడు. ఈ క్రమంలోనే తల్లీ కొడుకుల మధ్య ఓ రోజు మరోసారి పెళ్లి విషయంలో మాటామాటా పెరిగింది. దీంతో కోపోద్రిక్తుడైన హరీష్ క్షణికావేశంలో విచక్షణ కోల్పోయి కన్నతల్లిపైనే క్రికెట్ బ్యాట్ తో దాడిచేసాడు.

వెంకటేశ్వరమ్మ తలపై కొడుకు బలంగా కొట్టడంతో తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. దీంతో భయపడిపోయిన హరీష్ తల్లిని అలాగే వదిలేని ఇంటితలుపులు మూసేసి పరారయ్యాడు. ఈ ఘటన తర్వాత చాలాసేపటికి ఇంటికి వచ్చిన చింతరాజు తలుపుతెరిచి చూడగా భార్య రక్తపుమడుగులో పడివుంది. దీంతో అతడు భార్యను చికిత్స నిమిత్తం బందరు ప్రభుత్వాస్పత్రికి తరలించాడు. అయితే అప్పటికే ఆమె మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

PREV
click me!

Recommended Stories

Gen z పోస్టాఫీస్‌లు వ‌చ్చేస్తున్నాయ్‌.. వీటి ప్ర‌త్యేక‌త ఏంటి.? వీటిలో ఏముంటాయ్‌..
మహిళల కోసం వన్ స్టాప్ సెంటర్లు.. వీటివల్ల లాభాలేంటో తెలుసా?