Manipur Election 2022 : మణిపూర్ రెండో దశ పోలింగ్ లో హింస.. వేర్వేరు ఘటనల్లో ఇద్దరు మృతి..

Published : Mar 05, 2022, 02:04 PM IST
Manipur Election 2022 : మణిపూర్ రెండో దశ పోలింగ్ లో హింస.. వేర్వేరు ఘటనల్లో ఇద్దరు మృతి..

సారాంశం

మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ శనివారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. అయితే రెండో విడత కూడా హింసాత్మక ఘటనల మధ్యే జరుగుతోంది. రెండు వేర్వేరు చోట్ల ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. 

మణిపూర్ :  Manipur లో ఈ రోజు రెండో విడత Assembly Election Polling జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ రెండో విడత ఎన్నికల పోలింగ్ కూడా హింసాత్మక ఘటనల మధ్య సాగుతున్నాయి. రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా ఏర్పాట్లు చేసినప్పటికీ ఈ ఘటనలు చోటుచేసుకోవడం గమనార్హం. థౌబాల్‌ జిల్లా, సేనాపతి జిల్లాల్లో పోలింగ్ సందర్భంగా చెలరేగిన హింసలో వేర్వేరు ఘటనల్లో ఇద్దరు చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. 

ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో భద్రత మరింత కట్టుదిట్టం చేశారు. మరికొన్ని చోట్ల కూడా అల్లర్లు చెలరేగినట్లు తెలుస్తోంది.  ఉదయం 11 గంటల వరకు 28 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. పది జిల్లాలు.. 22 నియోజకవర్గాలు 92 మంది అభ్యర్థులు మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల రెండో ఫేజ్ పోలింగ్ లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 

కాగా, మణిపూర్ లో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు అధికారం దక్కించుకోవాలని చూస్తున్నాయి. ఇప్పటివరకు ఎత్తుకు పైఎత్తులు వేస్తూ ప్రణాళికలతో ప్రచారం సాగిస్తూ ఓటర్లను తమ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నం చేశాయి. ఈ క్రమంలోనే శనివారం నాడు రెండో దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. వివరాల్లోకి వెళితే మణిపూర్లో 2022 అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ ప్రారంభం అయింది. మొత్తం 22 అసెంబ్లీ నియోజక వర్గాల్లో 92 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొదటి దశలో ఫిబ్రవరి 28న పోలింగ్ జరిగిన ఐదు నియోజకవర్గాల్లో 12 పోలింగ్ స్టేషన్లలో రీపోలింగ్ కూడా జరుగుతోంది. 

ఎటువంటి విరామం లేకుండా సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. 4,28,679 మంది మహిళలు, 31 మంది ట్రాన్స్‌జెండర్లతో సహా మొత్తం 8,38,730 మంది ఓటర్లు తమ ఓటు హక్కును ఆరు ఎలక్టోరల్ జిల్లాల్లోని 1,247 పోలింగ్ స్టేషన్‌లలో వినియోగించుకోనున్నారు. ఆ ప్రాంతాల్లో తౌబల్, జిరిబామ్, చందేల్, ఉఖ్రుల్, సేనాపతి, తమెంగ్‌లాంగ్ లు ఉన్నాయి.  ఈ రోజు  జరుగుతున్న ఓటింగ్ లో కీలక నేతలు తమ అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకోబోతున్నారు. 

మ‌ణిపూర్ మాజీ ముఖ్యమంత్రి విక్రమ్ ఈ బి సింగ్ ఆయన కుమారుడు సూరజ్ కుమార్ మాజీ ముఖ్యమంత్రి ఓక్రం ఇబోబిసింగ్‌, ఆయన కుమారుడు సూరజ్ కుమార్,  మాజీ ఉపముఖ్యమంత్రి గైఖాంగమ్‌ వంటి ప్రముఖులతో పాటు బీజేపీ నుంచి 22 మంది కాంగ్రెస్ 18,  జెడియు,  నాగా పీపుల్స్  ఫ్రంట్ చెరో పది మంది, నేషనల్ పీపుల్స్ పార్టీ 11మంది, శివసేన,  ncp  ఇద్దరు చొప్పున.  ఆర్ పిఐఏ నుంచి ముగ్గురు, 12 మంది స్వతంత్ర అభ్యర్థులు రెండో విడత అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచారు. మణిపూర్  అసెంబ్లీలో మొత్తం 60 స్థానాలు ఉన్నాయి.

ఫిబ్రవరి 28న 38 స్థానాలకు మొదటి విడత ఓటింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ రోజు కీలకమైన అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ ప్రారంభమైంది. సామాజిక దూరం ఓట్ల కోసం ప్రోటోకాల్లు నిర్వహించబడుతున్నాయి. పోలింగ్ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ నాయకుడు ఓక్రమ్ ఇబోబి సింగ్ పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు. సింగ్ తౌబాల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన ఓటు వేసే సమయంలో కొంత ఆలస్యమైంది.  ఈ క్ర‌మంలోనే ఆయ‌న పోలింగ్ లో కొన్ని సాంకేతిక లోపాలు ఉన్నాయ‌ని ఆయ‌న అన్నారు. 

PREV
click me!

Recommended Stories

AI Smart Glasses : పోలీసుల చేతికి ఏఐ అస్త్రం.. ఈ మ్యాజిక్ గ్లాసెస్ నేరస్తులను ఎలా గుర్తిస్తాయి?
uttar Pradsh : ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో దేశంలోనే టాప్... ఏ రాష్ట్రమో తెలుసా?