
న్యూఢిల్లీ: రైల్వే స్టేషన్ (Railway Station)లో ఆ ట్రైన్ (Train) ఆగి ఆగగానే ఇంజిన్‌లో మంటలు (Fire) వ్యాపించాయి. ఇంజిన్‌తోపాటు దానితోపాటే ఉన్న మరో రెండు బోగీల్లో (Coaches)నూ మంటలు కనిపించాయి. ఈ ̣మంటలు మిగిలిన బోగీలన్నింటికీ వ్యాపించకుండా ప్రయాణికులు సకాలంలో అప్రమత్తం అయ్యారు. అనూహ్యంగా అందరూ సమన్వయంలో ఉండి మంటలు మండుతున్న బోగీల నుంచి మిగిలిన బోగీలను వేరు చేసి మరో వైపునకు నెట్టారు. అందరూ కలిసి ఆ రైలు బోగీలను ఇంజిన్ నుంచి వేరు చేసి అలవోకగా తోశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాకు ఎక్కింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది.
సహరన్‌పుర్ - ఢిల్లీ ప్యాసింజర్ ట్రైన్ దౌరాలా రైల్వే స్టేషన్‌లో ఆగింది. మీరట్‌లోని దౌరాలాలో సహరన్‌పుర్ - ఢిల్లీ ప్యాసింజర్ ట్రైన్ ఆగగానే ఇంజిన్‌లో మంటలు వచ్చాయి. దాని వెనుకాల ఉన్న మరో రెండు బోగీల్లోనూ మంటలు వ్యాపించాయి. దీంతో రైల్వే స్టేషన్‌లోని భద్రతా సిబ్బంది అప్రమత్తమైంది. వెంటనే మంటలు అంటుకున్న బోగీల నుంచి మిగిలిన బోగీలను అన్నింటినీ వేరు చేయాలని నిర్ణయం తీసుకుంది. వారు ట్రైన్ బోగీలను వెనక్కి నెట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ప్రయాణికులనూ సహాయం అడిగారు. ప్రయాణికులంతా మూకుమ్మడిగా ట్రైన్‌ను ఒక వైపు అంటే.. మంటలు వ్యాపిస్తున్న బోగీలకు దూరంగా నెట్టారు. దీంతో ట్రైన్ వెనక్కి వెళ్లింది. భారీ అగ్ని ప్రమాదాన్ని ఈ చర్య ద్వారా వారు తప్పించగలిగారు.
ఆ తర్వాత దౌరాలా రైల్వే స్టేషన్‌లోని అగ్నిమాపక సిబ్బంది సహరన్‌పుర్ - ఢిల్లీ ప్యాసింజర్ ట్రైన్ ఇంజిన్‌లో అంటుకున్న మంటలను ఆర్పేశారు. అయితే, ఈ ప్రమాదం కారణంగా రైల్వే ట్రాఫిక్ కొద్ది సేపు అంతరాయానికి గురైందని అధికారులు చెప్పారు. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని తెలిపారు. అలాగే, ఈ ప్రమాదానికి గల కారణాలను ఇంకా గుర్తించాల్సి ఉన్నదని వివరించారు.
ఇదిలా ఉండగా, కేంద్ర ప్రభుత్వం ఇటీవలే బడ్జెట్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. గతంలో రైల్వే బడ్జెట్(Railway Budget) ప్రత్యేకంగా ప్రవేశపెట్టేవారు. ఆ తర్వాత రైల్వే బడ్జెట్‌ను ప్రధాన బడ్జెట్‌లో కలిపేశారు. ఆ తర్వాత రైల్వే శాఖకు న్యాయమైన కేటాయింపులు జరపడం లేదని, ప్రైవేటు భాగస్వామ్యానికి తెరలేపి క్రమంగా.. ప్రైవేటు పరం(Privatisation) చేయనుందనే ఆరోపణలు కొంతకాలంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా బడ్జెట్ సందర్భంలో ఈ చర్చకు ప్రాముఖ్యత సంతరించుకుంటుంది. ఈ నేపథ్యంలోనే ఈ ప్రశ్న కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్(Minister Ashwini vaishnaw) ముందుకు వచ్చింది.
రైల్వే, కమ్యూనికేషన్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విణి వైష్ణవ్‌ను కొందరు విలేకరులు రైల్వేను ప్రైవేటుపరం చేస్తున్నారనే చర్చపై స్పందించాల్సిందిగా కోరారు. రైల్వేలో ప్రభుత్వం మరింత ప్రభావవంతమైన పాత్ర పోషించాల్సి ఉన్నదని ఆయన తెలిపారు. అంతేకానీ, రైల్వేను ప్రైవేటీకరణ చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రైల్వే ప్రయాణికుల అనుభూతిని మార్చాలనే ఆలోచన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వద్ద ఉన్నదని వివరించారు. కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా మూడు అంశాలపై ఫోకస్ పెట్టిందని తెలిపారు. స్టేషన్‌లను పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడం, కొత్త తరం ట్రైన్లు, ప్రయాణికుల భద్రత.. ఈ మూడు అంశాలపై ప్రభుత్వం దృష్టి సారిస్తున్నదని వివరించారు.