10 లక్షలిస్తేనే కూతురుతో హనీమూన్ వెళ్తా -అత్తమామాలకు అల్లుడి డిమాండ్.. 5 లక్షలే ఇవ్వడంతో నగ్నంగా ఫొటోలు తీసి..

Published : May 19, 2023, 07:42 AM ISTUpdated : May 19, 2023, 07:43 AM IST
10 లక్షలిస్తేనే కూతురుతో హనీమూన్ వెళ్తా -అత్తమామాలకు అల్లుడి డిమాండ్.. 5 లక్షలే ఇవ్వడంతో నగ్నంగా ఫొటోలు తీసి..

సారాంశం

భార్యను హనీమూన్ కు తీసుకెళ్లాలంటే తన అత్తమామలు కచ్చితంగా రూ.10 లక్షలు ఇవ్వాలని ఓ అల్లుడు డిమాండ్ చేశాడు. హనీమూన్ కు వెళ్లిన తరువాత భార్యను అసభ్యకరంగా ఫొటోలు తీసి బ్లాక్ మెయిల్ కు పాల్పడ్డాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో వెలుగులోకి వచ్చింది. 

రూ.10 లక్షలు ఇస్తేనే కూతురుతో హనీమూన్ కు వెళ్తానని ఓ అల్లుడు అత్తామామలతో డిమాండ్ చేశాడు. ఏం చేయాలో తెలియక ఆ అత్తామామ రూ.5 లక్షలను అల్లుడి చేతిలో పెట్టారు. అయినా కూడా భార్యతో అతడు సన్నిహితంగా మెలగలేదు. పైగా ఆమెను నగ్నంగా, అసభ్యకరంగా ఫొటోలు తీసి, మిగితా డబ్బులు తీసుకురాకపోతే ఆ ఫొటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని బెదిరించాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. 

తమిళనాడులో విషాదం.. బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు, ముగ్గురు మృతి, మరొకరికి గాయాలు

ఉత్తరప్రదేశ్ లో ఈ విచిత్ర ఘటన చోటు చేసుకుంది. పోలీసులు, బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. పిలిభిత్ జిల్లాలోని బదాయూ పోలీసు స్టేషన్ పరిధిలో నివసించే ఓ యువకుడికి ఆ జిల్లా కేంద్రానికి చెందిన యువతితో ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో పెళ్లి జరిగింది. ఆ యువతి తల్లిదండ్రులు పెళ్లి సమయంలో అబ్బాయికి రూ.15 లక్షల విలువైన బంగారాన్ని కట్నం రూపంలో అందించారు. అలాగే పెళ్లి కోసం మరో రూ.20 లక్షలు ఖర్చు అయ్యాయి. పెళ్లయితే అయ్యింది కానీ కొత్త జంటకు తొలిరాత్రి జరగలేదు. పెళ్లయిన నాటి నుంచి ఆ యువకుడు తన భార్యతో దూరంగానే ఉంటున్నాడు.

కొత్త జంట హనీమూన్ కు కూడా వెళ్లలేదు. భర్త తనతో దూరంగా ఉంటున్నాడని భార్య మానసికంగా కృంగిపోయింది. ఈ విషయాన్ని ఆమె తన అత్తగారికి కూడా చెప్పింది. కానీ ఆమె కూడా దీనిని పట్టించుకోలేదు. ఈ క్రమంలో ఆ యువతి కొన్ని రోజుల కిందట తన తల్లిగారింటికి వెళ్లింది. తల్లితో విషయం మొత్తం చెప్పింది. అయితే ఏప్రిల్ నెల 12వ తేదీన అల్లుడు అత్తగారింటికి వచ్చాడు. ఆ సమయంలో అత్త అల్లుడితో మాట్లాడింది. ఎవైనా అనారోగ్య సమస్యలు ఉంటే చెప్పాలని, ట్రీట్మెంట్ చేయిస్తామని చెప్పారు. భార్య భర్తలు ఇలా దూరంగా ఉండటం మంచిది కాదని హితవు పిలికారు. 

ముస్లింలకు, షార్ట్ డ్రెస్ లు వేసుకునే వారికి నో ఎంట్రీ.. - యూపీలోని ప్రసిద్ద అలీగఢ్ హనుమాన్ ఆలయ కొత్త రూల్స్

అత్తమాటలు విన్న తరువాత అల్లుడు అసలు విషయం బయటపెట్టాడు. తనకు రూ.10 లక్షలు ఇస్తే వెంటనే కూతురును తీసుకొని హనీమూన్ కు వెళ్తానని అత్తామామలతో చెప్పాడు. కూతురు సంతోషం కోసం అల్లుడికి రూ.5 లక్షలను అందించారు. దీంతో మే 5వ తేదీన ఈ కొత్త జంట నైనితాల్ కు హనీమూన్ కు వెళ్లారు. అయితే అక్కడ కూడా భార్యతో అతడు శారీరకంగా కలవలేదు. పైగా ఆమెను నగ్నంగా, అసభ్యకరంగా ఫొటోలు, వీడియోలు తీశాడు. రూ.5 లక్షలు తీసుకురావాలని భార్యతో డిమాండ్ చేశాడు. లేకపోతే ఈ ఫొటోలను, వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని హెచ్చరించాడు. తరువాత హనీమూన్ జరుపుకుందామని తేల్చిచెప్పాడు.

న్యాయశాఖ కొత్త మంత్రిగా అర్జున్ రామ్ మేఘ్వాల్.. ఆయన గురించి తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు.. 

అతడి చేష్టలతో ఆ భార్యకు విసుగొచ్చింది. మే 13వ తేదీన ఆమె తన తల్లిగారింటికి వచ్చింది. అల్లుడి చేసిన చేష్టలన్నీ తల్లిదండ్రులకు చెప్పింది. తరువాత ఆమె పీలీభీత్ పోలీసులను ఆశ్రయించింది. తనకు ఎదురైన అనుభవాన్ని అంతా వారికి వివరించి తన భర్తపై, అలాగే తన అత్తపై ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు నిందితుడిపై వరకట్నం, వేధింపులకు సంబంధించిన కేసులు నమోదు చేశారు. ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం