
ఆమెకది రెండో పెళ్లి. ఈ విషయం భర్తకు తెలియదు. అయినా చక్కగా సాగిపోతున్న కాపురం. ఈ దంపతులకు ఒక కుమారుడు జన్మించాడు. ఇప్పుడు ఆ పిల్లాడి వయస్సు ఏడు సంవత్సరాలు. అయితే కొంత కాలం నుంచి భార్య ఫోన్ లోనే ఎక్కవ టైం స్పెండ్ చేస్తోంది. దీంతో కుమారుడిని పట్టించుకోవడం తగ్గిపోయింది. ఈ విషయం భర్త గమనించాడు. భార్యను మందలించాడు. అయినా ఆమెలో మార్పు రాలేదు. అలాగే కొనసాగుతుడంతో కుమారుడి ఆరోగ్యం చెడిపోయింది. ఈ విషయాన్ని భర్త.. భార్య తరఫు బంధువుల దృష్టికి తీసుకెళ్లాడు.
PM Modi Hyderabad Visit: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం.. కాషాయమయమైన హైదరాబాద్
పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టించాడు. ఈ సమయంలో అతడికి అసలు విషయం తెలిసింది. తన భార్యకు ముందే మరొకరితో పెళ్లి అయ్యిందని తెలుసుకున్నాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. కోపంతో ఆమె తన పుట్టింటికి వెళ్లిపోయింది. అక్కడ మరో వ్యక్తిని మూడో పెళ్లి చేసుకుంది. ఈ విషయం తెలిసి భర్త షాక్ అయ్యాడు. ఈ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది.
బెంగళూరులో 32 ఏళ్ల విజయ్ బోస్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్నాడు. ఆయన తమిళనాడు రాష్ట్రం తేనీ జిల్లాకు చెందినవాడు. అతడికి 2014లో వివాహం జరిగింది. భార్య పేరు విద్య. ఆమెకు ఇది వరకే ఒకరితో పెళ్లి జరిగింది. ఆ విషయం తల్లిదండ్రులు దాచిపెట్టి ఈ వివాహం జరిపించారు. వీరికి ఒక బాబు జన్మించాడు. ప్రస్తుతం ఆ పిల్లాడికి ఏడు సంవత్సరాలు ఉంటాయి. అయితే జాబ్ విషయంలో బోస్ తరచూ వేరే చోట్ల ఉండాల్సి వచ్చింది. దీంతో ఇంటికి దూరంగా ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇంటి వద్దే ఉంటున్న భార్య కుమారుడిని సరిగా పట్టించుకోలేదు. సెల్ ఫోన్ వాడటానికే అధిక సమయం వెచ్చించేది. దీంతో అబ్బాయి హెల్త్ చెడిపోయింది. భర్త ఇంటికి చేరుకొని భార్యను తిట్టాడు. ప్రవర్తన మార్చుకోవాలని సూచించాడు. ఆమె మారకపోవడంతో పెద్దల మధ్య పంచాయితీ పెట్టాడు.
ఓర్నీ.. నాగు పాముతో ఆటలాడుతూ, తలను ముద్దాడిన తాగుబోతు.. చివరికి ఏం జరిగిందంటే ?
ఆ సమయంలో తన భార్యకు ఇంతకు ముందే పెళ్లి జరిగిందని, తను రెండో భర్త అని తెలుసుకొని బాధపడ్డాడు. దీంతో ఈ భార్యా భర్తల మధ్య లొల్లి మొదలయ్యింది. ఈ క్రమంలో కోపంతో కొడుకును భర్త వద్దే ఉంచి తన తల్లిగారింటికి చేరుకుంది. జరిగిందేదో జరిగిపోయింది ఇక నుంచి అయినా సరిగా ఉందామని భర్త ఆ భార్య వద్దకు వెళ్లి నచ్చజెప్పాడు. కాపురానికి రావాలని కోరాడు. కానీ అవేవీ ఫలించలేదు. భార్య తన తల్లిగారింటి వద్దనే ఉండిపోయింది. ఈ క్రమంలో మే నెలలో విద్య మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న భర్త బోస్ షాక్ అయ్యాడు. తన భార్య తరఫువారిని కోపంతో నిలదీశాడు. దీంతో వాళ్లే రివర్స్ అయ్యారు. తిరిగి అల్లుడిపైనే వరకట్న వేధింపులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఏం చేయాలో అర్థం కాని విజయ్ బోస్ స్థానికంగా ఉన్న ఓ మహిళ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాడు. దీంతో తన భార్య విద్య, ఆమె తల్లిదండ్రులు, సోదరుడు, మూడో భర్త ఊరు వదలి జంప్ అయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులను ఇప్పుడు వారిని వెతికే పనిలో పడ్డారు.