తెలంగాణ‌కు ప్ర‌ధాని రూ. 2,52,202 కోట్లు ఇచ్చారు.. స‌వ‌తి త‌ల్లి ప్రేమ చూప‌లేదు - అమిత్ షా

Published : Jun 02, 2022, 11:55 PM ISTUpdated : Jun 02, 2022, 11:56 PM IST
తెలంగాణ‌కు  ప్ర‌ధాని రూ. 2,52,202 కోట్లు ఇచ్చారు.. స‌వ‌తి త‌ల్లి ప్రేమ చూప‌లేదు - అమిత్ షా

సారాంశం

కేంద్రానికి అన్ని రాష్ట్రాలు సమానమేనని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. ఒక రాష్ట్రాన్ని ఎక్కువగా, మరో రాష్ట్రాన్ని తక్కువగా చేసి ఎప్పుడూ చూడలేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు వివిధ పద్దుల కింద తెలంగాణకు రూ. 2,52,202 కోట్లు ఇచ్చిందని స్పష్టం చేశారు. 

ప్రధాని నరేంద్ర మోదీ గుండెల్లో తెలంగాణ ఎప్పుడూ ఉందని, ఏ రాష్ట్రం ప‌ట్ల కేంద్ర ప్ర‌భుత్వం సవతి తల్లి ప్రేమ చూప‌లేద‌ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. న్యూఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయ‌న మాట్లాడారు.  తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చరిత్ర పోరాటాలతో నిండి ఉందన్నారు. తెలంగాణ ఏర్పాటు కోసం యువత ఎన్నో ఏళ్లుగా పోరాడి త్యాగాలు చేసిందన్నారు. 

fire accident : గుజరాత్‌లోని వడోదరలో భారీ పేలుడు.. దీపక్ నైట్రేట్ కంపెనీలో చెలరేగిన మంటలు

చివరికి ఎన్నో పోరాటాల త‌రువాత 2014 జూన్ 2వ తేదీన భారతదేశంలోని అతి చిన్న వ‌యస్సులో ఉన్న తెలంగాణ రాష్ట్రం ఉనికిలోకి వ‌చ్చింది అని ఆయ‌న పేర్కొన్నారు. అయితే తెలంగాణ ఏర్పాటు చేదుకు దారితీసే విధంగా జరిగిందని మంత్రి చెప్పారు. గత ఎనిమిదేళ్లలో తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం రూ.2,52,202 కోట్లు ఖర్చు చేసిందని చెప్పారు. ‘‘ మేము వివిధ పద్దుల కింద డబ్బు పంపాము. తెలంగాణ ఎప్పుడూ ప్రధాని నరేంద్ర మోడీ గుండెల్లోనే ఉంది. కానీ దురదృష్టవశాత్తు రాష్ట్రం నుంచి మాకు పెద్దగా మద్దతు లభించలేదు ’’ అని అన్నారు. 

సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ లేకుంటే తెలంగాణ, దాని పొరుగు ప్రాంతాలు నిజాంల నిరంకుశ పాలన నుంచి విముక్తి పొందలేకపోయేవని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ పాలన పోయి తమ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణ విమోచన దినోత్సవం, హైదరాబాద్ విమోచన దినోత్సవం నిర్వహిస్తామని తెలిపారు. “ సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ ఆ పోలీసు చర్య తీసుకోకపోతే, బహుశా భారతదేశం వేరే మ్యాప్‌ని కలిగి ఉండేది. నిజాంల నిరంకుశ పాలన నుంచి విముక్తి కల్పించిన సర్దార్ పటేల్‌కు దేశం మొత్తం రుణపడి ఉంటుంది. ఇప్ప‌టికి కూడా తెలంగాణ విమోచన దినోత్సవం లేదా హైదరాబాద్ విమోచన దినోత్సవం జరుపుకోవ‌డం లేద‌ని చెప్పడానికి ఎంతో బాధ‌గా ఉంది. ఏది ఏమైనప్పటికీ పాలన మారబోతోంది.. తప్పకుండా జరుపుకుంటాం. ’’ అని అన్నారు. 

తెలంగాణ విముక్తి కోసం నిజాంలకు వ్యతిరేకంగా నిలిచిన తెలంగాణకు చెందిన అనేక మంది ప్రముఖులు, స్వాతంత్ర సమరయోధులు, రామ్‌జీ గౌర్, కుమురం భీం తదితరుల పేర్లను షా తన ప్రసంగం సందర్భంగా గుర్తు చేశారు. దేశ స్వాతంత్య్రం కోసం, తెలంగాణను విముక్తి కోసం పోరాడిన వారిలో మాజీ ప్రధాని నరసింహారావు, స్వామి రామానంద తీర్థ, పండిట్ నరేంద్ర, సురవరం ప్రతాప్ రెడ్డి, కవి దాశరథి, రంగాచారి గోవింద్‌భాయ్ ష్రాఫ్‌లను కూడా ఆయ‌న గుర్తు చేశారు. 

కాగా.. తెలంగాణలోని 7 మండలాలను ఆంధ్రప్రదేశ్ లో విలీనం చేయడం వంటి అనేక అంశాలను ప్రస్తావించి కొత్త రాష్ట్రంపై కేంద్రం వివక్ష చూపుతోందని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆరోపించారు. హైదరాబాద్ లో జరిగిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో సీఎం ప్ర‌స‌గించారు. రాష్ట్రాలను ఆర్థికంగా బలహీనపరిచేందుకు కేంద్రం కుట్ర పన్నుతోందని ఆరోపించారు.

గవర్నర్ తమిళిసైకి సీఎం కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు.. రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ

‘‘ ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం ‘బలమైన కేంద్రం - బలహీనమైన రాష్ట్రాలు’ అనే పనికిమాలిన సిద్ధాంతంపై ఆధారపడి ఉంది.  కేంద్రం విధించే పన్నుల నుంచి రాష్ట్రాలకు రాజ్యాంగబద్ధంగా రావాల్సిన వాటాను కోల్పోవడానికి కేంద్ర ప్రభుత్వం సెస్ రూపంలో పన్నులను మారుస్తోంది ’’ అని సీఎం కేసీఆర్ తెలిపారు. రాష్ట్రాలకు రావాల్సిన కోట్లాది రూపాయలను కేంద్రం దుర్వినియోగం చేస్తోందన్న విషయం అందరికీ తెలిసిన విషయమేనని, కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా వివిధ రకాల ఆంక్షలు విధిస్తోందని తెలిపారు. రాష్ట్రాల ఆర్థిక స్వేచ్ఛను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తోందని ఆరోపించారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?