అదుపుతప్పి ఇంటిపైకి దూసుకెళ్లిన పోలీసు వాహనం.. ముగ్గురికి గాయాలు.. ఎక్కడంటే ?

By team teluguFirst Published Dec 19, 2022, 1:58 PM IST
Highlights

పోలీసు వాహనం అదుపుతప్పి ఓ ఇంటిని ఢీకొట్టింది. దీంతో ఆ ఇంట్లో ఉన్న ఇద్దరు దంపతులు, ఓ చిన్నారికి గాయాలయ్యాయి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. 

ఓ పోలీసు వాహనం అదుపుతప్పి ఇంటిపైకి దూసుకెళ్లింది. దీంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇందులో మూడేళ్ల చిన్నారి కూడా ఉంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

బీహార్ లో ప్రారంభం కాకముందే కుప్పకూలిన వంతెన .. రూ. 14 కోట్లు నీటిపాలు

ఆదివారం రాత్రి సమయంలో ఫెఫానా పోలీస్ స్టేషన్‌కు చెందిన ఓ కారు గర్వార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సింగంచ్వార్ గ్రామానికి చేరుకుంది. అయితే ఓ టిన్ షెడ్ ఇంటి సమీపంలోకి చేరుకునే సరికి అది అదుపుతప్పింది. ఆ ఇంటిపైకి దూసుకుపోయింది. ఈ ఘటనలో ఆ ఇంట్లో ఉన్న 28 ఏళ్ల దిగ్విజయ్ రామ్, అతడి 23 ఏళ్ల భార్య చందా, వారి మూడేళ్ల కుమారుడు రిషబ్ కు తీవ్ర గాయాలు అయ్యాయి.

కర్ణాటక అసెంబ్లీలో సావర్కర్ ఫొటో.. భగ్గుమన్న ప్రతిపక్షాలు.. ఎన్నికలకు ముందు ఇదే చివరి అసెంబ్లీ సెషన్

వెంటనే పోలీసులు క్షతగాత్రులను జిల్లా హాస్పిటల్ కు తరలించారు. అయితే ఈ ఘటనపై ని గర్వార్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ రాజ్ కుమార్ సింగ్ మాట్లాడుతూ..  ఫెఫానా పోలీస్ స్టేషన్‌కు చెందిన ఓ కారుకు ఫిట్ నెస్ లేదని అన్నారు. దీంతోనే ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. ఈ ప్రమాదంలో ముగ్గురికి గాయాలు అయ్యాయిని అన్నారు. వారు ప్రస్తుతం హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. ఈ ఘటనపై ఇప్పటి వరకు ఎలాంటి ప్రమాదమూ జరగలేదని రాజ్ కుమార్ సింగ్ తెలిపారు. 
 

click me!