హిమాచల్ అసెంబ్లీలో బీజేపీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్ర‌వేశ‌పెట్టిన‌ ప్రతిప‌క్షాలు

By team teluguFirst Published Aug 11, 2022, 3:25 PM IST
Highlights

హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్షాలు అధికార బీజేపీపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. 66 మంది సభ్యులు ఉన్న అసెంబ్లీలో బీజేపీకి మొత్తం 43 ఎమ్మెల్యేలు ఉన్నారు. కాంగ్రెస్ 22 మంది సభ్యులు ఉన్నారు. 

జై రామ్ ఠాకూర్ నేతృత్వంలోని బీజేపీ రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతిపక్ష కాంగ్రెస్, సీపీఎంలు అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం ప్ర‌వేశ‌పెట్టాయి. గురువారం వీటిపై చ‌ర్చ జ‌రిగింది. వర్షాకాల సమావేశాల రెండో రోజు చర్చను ప్రారంభించిన ప్రతిపక్ష నేత ముఖేష్ అగ్నిహోత్రి మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని అన్నారు.

నేను ఎప్పుడూ వైస్ ప్రెసిడెంట్ కావాలని కోరుకోలేదు - బీహార్ సీఎం నితీష్ కుమార్

ఠాకూర్ నేతృత్వంలోని ప్రభుత్వ హయాంలో కొండ ప్రాంతంలో ఇప్పటి వరకు 354 హత్యలు, 1,574 అత్యాచారాలు, 7,406 వేధింపుల కేసులు నమోదయ్యాయని ఆయన చెప్పారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన చర్చ మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగింది.

ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికలు.. ఓబీసీ ఓట‌ర్లు టార్గెట్ గా బీజేపీ వ్యూహాలు

నిన్న‌నే (బుధవారం) అసెంబ్లీలో 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, సీపీఎంకు చెందిన ఏకైక శాసనసభ్యుడు ఈ తీర్మానానికి నోటీసు ఇచ్చారు. హిమాచల్ ప్రదేశ్ శాసనసభలో విధివిధానాలు, వ్యాపార ప్రవర్తన నియమాలు 278 ప్రకారం ఉదయం 9.50 గంటలకు నోటీసు ఇచ్చినట్లు స్పీకర్ బుధవారం సభకు తెలిపారు. ‘‘ ప్రభుత్వం అన్ని రంగాలలో విఫలమైనందున మంత్రి మండలిపై సభ అవిశ్వాసం వ్యక్తం చేస్తుందని నోటీసు పేర్కొంది ’’ అని స్పీకర్ చెప్పారు.

మహారాష్ట్రలో ఐటీ శాఖ దాడులు.. ఓ వ్యాపారి ఇంట్లో రూ.58 కోట్ల నగదు, 32 కిలోల బంగారం స్వాధీనం 

68 మంది సభ్యులున్న సభలో బీజేపీకి 43 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాంగ్రెస్‌కు 22 మంది ఉన్నారు. ఇద్దరు స్వతంత్రులు, ఒక సీపీఐ(ఎం) ఎమ్మెల్యే ఉన్నారు.
 

click me!