నేను ఎప్పుడూ వైస్ ప్రెసిడెంట్ కావాలని కోరుకోలేదు - బీహార్ సీఎం నితీష్ కుమార్

By team teluguFirst Published Aug 11, 2022, 2:48 PM IST
Highlights

తనకు ఉపరాష్ట్రపతి పదవి కావాలని అనుకోలేదని బీహార్ సీఎం నితీష్ కుమార్ స్పష్టం చేశారు. బీజేపీ సీనియర్ నేత సుశీల్ కుమార్ మోడీ చేసిన వ్యాఖ్యలు పెద్ద జోక్ అని అన్నారు. 

తాను భారత ఉపరాష్ట్రపతిని కావాలనుకున్నానని బీజేపీ నేత సుశీల్ కుమార్ మోడీ చెప్పడం బోగస్, జోక్ అని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అన్నారు. తాను ఎప్పుడూ అది కోరుకోలేద‌ని స్ప‌ష్టం చేశారు. ‘‘నేను ఉపరాష్ట్రపతిని కావాలనుకుంటున్నానని ఒక వ్యక్తి (సుశీల్ మోడీ) చెప్పడం మీరు విన్నారు. వాట్ ఏ జోక్ ! ఇది బోగస్. నాకు అలాంటి కోరికేదీ లేదుయ ’’ అని నితీష్ కుమార్ మీడియాతో మాట్లాడారు.

ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికలు.. ఓబీసీ ఓట‌ర్లు టార్గెట్ గా బీజేపీ వ్యూహాలు

కుమార్ భారత ఉపాధ్యక్షుడవ్వాలని కోరుకుంటున్నారని, ఆయ‌న ఆకాంక్షలను నెరవేర్చడంలో పార్టీ విఫలమైనందుకు బీజేపీతో పొత్తును వ‌దులుకున్నార‌ని బీహార్ మాజీ డిప్యూటీ సీఎం, ప్ర‌స్తుత రాజ్య‌స‌భ ఎంపీ సుశీల్ కుమార్ మోడీ బుధ‌వారం అన్నారు.  2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయేను చూసి బీహార్ ప్ర‌జ‌లు ఓటు వేశారని, ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీని, బీహారీల‌ను జేడీయూ నేత అవమానించారని అన్నారు. బీజేపీని కాద‌ని కాంగ్రెస్, వామపక్షాలతో చేతులు కలిపారని సుశీల్ మోదీ విమర్శించారు. లాలూ ప్రసాద్ యాదవ్ అనారోగ్యాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్జేడీని నితీష్ తరిమికొడతారని, దాన్ని చీల్చడానికి ప్రయత్నిస్తారని మోడీ ఆరోపించారు. ‘ ఆర్జేడీ నేత తేజస్వీని వాస్తవ సీఎంగా కొత్త బీహార్ ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో చూడాలనుకుంటున్నాం. వచ్చే ఎన్నికలకు ముందు అది పడిపోతుంది’ అని ఆయన అన్నారు. 

చిన్నారులతో ప్రధాని మోదీ రక్షా బంధన్ సెలబ్రేషన్.. వారంతా ఎవరంటే..

సుశీల్ కుమార్ వ్యాఖ్యలను కౌంటర్ గా నితీష్ కుమార్ నేడు మీడియాతో మాట్లాడారు. ఇటీవల ముగిసిన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నిక‌ల్లో ఎన్డీఏ అభ్యర్థులకు జేడీ (యూ) మద్దతిచ్చిందని నితీష్ కుమార్ గుర్తు చేశారు. 2020 అసెంబ్లీ ఎన్నికల తర్వాత సుశీల్‌ కుమార్ మోడీని సీఎం పదవిని కూర్చోబెట్టేందుకు బీజేపీ అనుమతించి ఉండాల్సిందని అన్నారు. ‘‘ అతడి ప్రియమైన మిత్రుడు అతడిని ఎందుకు సీఎం చేయలేకపోయాడు ? అతడి(సుశీల్ కుమార్ మోడీ)ని ఆ పదవిలో నియమించినట్లయితే, విషయాలు ఈ స్థాయికి చేరుకునేవి కాదు ’’ అని నితీష్ కుమార్ అన్నారు.

మహారాష్ట్రలో ఐటీ శాఖ దాడులు.. ఓ వ్యాపారి ఇంట్లో రూ.58 కోట్ల నగదు, 32 కిలోల బంగారం స్వాధీనం 

కాగా.. బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏతో తెగతెంపులు చేసుకున్న తరువాత జేడీ(యూ) ‘మహాగత్‌బంధన్’ లో భాగంగా ఉన్న ఆర్జేడీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. దీంతో రికార్డు స్థాయిలో నితీష్ కుమార్ ఎనిమిదో సారి ఆగస్టు 10వ తేదీన ప్రమాణ స్వీకారం చేశారు.
 

click me!