మధ్యప్రదేశ్ కొత్త సీఎం ఈయనే: సింథియాలతో విడదీయలేని బంధం

Published : Mar 10, 2020, 01:54 PM ISTUpdated : Mar 10, 2020, 01:56 PM IST
మధ్యప్రదేశ్ కొత్త సీఎం ఈయనే: సింథియాలతో విడదీయలేని బంధం

సారాంశం

మధ్యప్రదేశ్ లో కాంగ్రెసు ప్రభుత్వాన్ని సంక్షోభంలో పడేసిన ఘనత బిజెపి నేత నరోత్తమ్ మిశ్రాకే దక్కుతుందని భావిస్తున్నారు. ఈ స్థితిలో బిజెపి అధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది.

భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెసు ప్రభుత్వం కూలిపోవడం బిజెపి ప్రభుత్వం ఏర్పడడం ఖాయంగా కనిపిస్తోంది. 19 మంది కాంగ్రెసు ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసిన నేపథ్యంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్ ప్రభుత్వం మైనారిటీలో పడిపోయినట్లే. ప్రస్తుత బలంతో బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి వెసులుబాటు కలిగింది.

బిజెపి నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థి పేరు కూడా ఖరారైనట్లు తెలుస్తోంది. డాక్టర్ నరోత్తమ్ మిశ్రా ముఖ్యమంత్రి పీఠం అధిష్టిస్తారనే ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. మధ్యప్రదేశ్ లో రాజకీయ సంక్షోభాన్ని సృష్టించడంలోనూ జ్యోతిరాదిత్య సింథియా వర్గానికి చెందిన ఎమ్మెల్యేలను బిజెపికి అనుకూలంగా మలచడంలోనూ ఆయనదే కీలక పాత్ర అని భావిస్తున్నారు. 

Also Read: మధ్యప్రదేశ్ సంక్షోభం: సింధియాల దెబ్బ, అప్పుడు నానమ్మ.... ఇప్పుడు మనవడు!

నరోత్తమ్ మిశ్రా సింథియాలకు అత్యంత సన్నిహితుడు కూడా. ఆయన సింథియాలకు చెందిన గ్వాలియర్ లోని జీవాజీ విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు.  మిశ్రా 1960 ఏప్రిల్ 10వ తేదీన జన్మించారు. దాతియా నుంచి శానససభకు ఎన్నికయ్యారు. ఆయన విధానసభకు 1990లో తొలిసారి ఎన్నికయ్యారు. 

నరోత్తమ్ మిశ్రా 1998, 2003, 2008, 2013ల్లో శానససభకు ఎన్నికయ్యారు. 2005లో ఆయన బాబులాల్ గౌర్ మంత్రివర్గంలో పనిచేసారు. శివరాజ్ సింగ్ చౌహాన్ మంత్రివర్గంలో ఆయన పనిచేశారు. 

Also Read: మధ్యప్రదేశ్ క్రైసిస్: 19 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామా

PREV
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌