పరీక్ష రాసేందుకు వెళ్లిన తల్లి.. పసికందును ఆడిస్తూ, విధులు నిర్వర్తించిన మహిళా కానిస్టేబుల్.. ఫొటోలు వైరల్

Published : Jul 11, 2023, 11:27 AM IST
పరీక్ష రాసేందుకు వెళ్లిన తల్లి.. పసికందును ఆడిస్తూ, విధులు నిర్వర్తించిన మహిళా కానిస్టేబుల్.. ఫొటోలు వైరల్

సారాంశం

మహిళా కానిస్టేబుల్ ఓ వైపు తన విధులు నిర్వర్తిస్తూనే.. మరో వైపు ఓ పసి బిడ్డ బాగోగులు చూసుకుంటూ తన మంచి మనసు చాటుకుంది. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

గుజారాత్ లో హైకోర్టు ప్యూన్ రిక్రూట్ మెంట్ పరీక్ష సందర్భంగా ఓ కానిస్టేబుల్ పసికందును ఎత్తుకొని కనిపిస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ కానిస్టేబుల్ ను నెటిజన్లు అభినందనలతో ముంచెత్తుతున్నారు. పోలీసు ఉన్నతాధికారులు కూడా ఆమెను ప్రశంసించారు. ఇంతకీ ఆమె ఎందుకు ఆ పసికందును ఎత్తుకోవాల్సి వచ్చింది ? అందరి మనసును దోచుకునేంతగా అక్కడ ఏం జరిగింది ? వంటి వివరాలు తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే.

వలంటీర్ వ్యవస్థ చాలా ప్రమాదకరం.. రూ.5 వేలు ఇచ్చి, ఇంట్లోకి దూరే అవకాశమిచ్చారు - పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు

గుజారాత్ లో హైకోర్టు లో ప్యూన్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి అనేక మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అభ్యర్థులను ఎంపిక చేసేందుకు గత ఆదివారం పరీక్ష నిర్వహించారు. అయితే పరీక్ష మరి కొద్ది నిమిషాల్లో ప్రారంభమవుతుందనగా అహ్మదాబాద్ లోని ఓ పరీక్ష కేంద్రానికి ఓ మహిళ తన నెలల కుమారుడితో పరిగెత్తుకుంటూ చేరుకుంది. 

కానీ ఆమె చేతిలో ఉన్న కుమారుడు ఏడుస్తున్నాడు. ఓ వైపు ఆ మహిళకు పరీక్ష ప్రారంభమవుతోంది. ఇదంతా గమనిస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్ దయా బెన్ అక్కడికి చేరుకుంది. పరిస్థితిని అర్థం చేసుకుంది. తాను బాబును చూసుకుంటానని, నిశ్చిత్తంగా వెళ్లి పరీక్ష రాయాలని ఆమెకు సూచించింది. దీంతో ఆ అభ్యర్థి పరీక్ష రాసేందుకు లోపలికి వెళ్లింది.

కానిస్టేబుల్ దయాబెన్ ఓ వైపు తన ఉద్యోగ బాధ్యత నిర్వర్తిస్తూనే.. మరో వైపు ఆ బాబును ఏడవకుండా చూసుకుంది. పరీక్ష పూర్తయ్యేంత వరకు ఆ పసికందు బాగోగులు చూసుకుంది. దీనికి సంబంధించిన ఫొటోలను అహ్మదాబాద్ పోలీసులు సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఆ ఫొటోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఆ మహిళా కానిస్టేబుల్ పై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. 
 

PREV
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం