ఉత్తర ప్రదేశ్ లో రోడ్డు ప్రమాదం... స్కూలు బస్సు, కారు ఢీ కొని 6గురు మృతి...

Published : Jul 11, 2023, 10:39 AM ISTUpdated : Jul 11, 2023, 10:53 AM IST
ఉత్తర ప్రదేశ్ లో రోడ్డు ప్రమాదం... స్కూలు బస్సు, కారు ఢీ కొని 6గురు మృతి...

సారాంశం

ఉత్తరప్రదేశ్ లో రాంగ్ రూట్లో వచ్చిన ఓ స్కూల్ బస్ కారును ఢీ కొట్టడంతో 6గురు మృతి చెందారు. 

ఉత్తరప్రదేశ్ : ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నేషనల్ హైవేపై రాంగ్ రూట్ లో వచ్చిన స్కూల్ బస్సు కారును ఢీ కొట్టింది. దీంతో ఆరుగురు మృతి చెందారు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతులను ఆస్పత్రికి తరలించారు. బోల్తాపడిన కారును హైవే మీదినుంచి పక్కకు తొలగించారు. 

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో మంగళవారం ఉదయం స్కూల్ బస్సు ఎస్‌యూవీని ఢీకొనడంతో ఇద్దరు చిన్నారులు సహా ఆరుగురు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ తెల్లవారుజామున ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్‌వేలో బస్సు రాంగ్ రూట్ లో వచ్చి, ఎదురుగా వస్తున్న ఎస్‌యూవీని ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు.

ప్రమాదంలో మరణించిన ఆరుగురు వ్యక్తులు కారులో ఉన్నవారే. ఎస్‌యూవీ గుర్గావ్‌కు వెళుతోంది. పోలీసులు బస్సు డ్రైవర్‌ను అరెస్టు చేశారు. "ఎస్‌యూవీలో ఉన్న ఎనిమిది మందిలో ఆరుగురు మరణించారు. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రిలో చేర్పించారు. డ్రైవర్‌ను అరెస్టు చేశారు, అతనిని విచారిస్తున్నారు. ఎఫ్‌ఐఆర్‌లో కఠినమైన సెక్షన్లు అమలు చేయబడుతున్నాయి" అని ఘజియాబాద్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ దేహత్ శుభమ్ పటేల్ చెప్పారు.

"బస్సు చాలా బలంగా ఢీకొట్టింది. దీంతో కారు తలుపులు కత్తిరించి మృతదేహాలను బయటకు తీశారు" అని అధికారులు తెలిపారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు వారు తెలిపారు.

PREV
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం