చెప్పులు కనిపించడం లేదంటూ మాజీ మేయర్ ఫిర్యాదు.. 4 వీధి కుక్కలను బంధించి, స్టెరిలైజ్ చేసిన అధికారులు

Published : Jun 15, 2023, 01:35 PM ISTUpdated : Jun 15, 2023, 01:36 PM IST
చెప్పులు కనిపించడం లేదంటూ మాజీ మేయర్ ఫిర్యాదు.. 4 వీధి కుక్కలను బంధించి, స్టెరిలైజ్ చేసిన అధికారులు

సారాంశం

మహారాష్ట్రలోని ఔరంగబాద్ కు చెందిన మాజీ మేయర్ చెప్పులు కనిపించకుండా పోయాయి. అయితే వీధి కుక్కల వల్ల తన చెప్పులు పోయాయని అతడు అధికారులకు ఫిర్యాదు చేశారు. వెంటనే అధికారులు రంగంలోకి దిగి ఆ నాలుగు వీధి కుక్కలను పట్టుకొని, వాటికి వాసెక్టమీ ఆపరేషన్ చేశారు. 

తన చెప్పులు కనిపించడం లేదంటూ మహారాష్ట్రలోని ఔరంగాబాద్ నగర పాలక సంస్థ మేయర్ ఫిర్యాదు చేశాడు. దీంతో హుటాహుటిన రంగంలోకి దిగిన సిబ్బంది నాలుగు వీధి కుక్కలను పట్టుకున్నారు. అనంతరం వాటికి స్టెరిలైజ్ చేశారు. నగరంలోని నక్షత్రవాడీ ప్రాంతంలో నివసిస్తున్న మాజీ మేయర్ నందకుమార్ ఘోడెలే ఫిర్యాదు చేయడంతో సిబ్బంది ఈ చర్యకు పూనుకున్నారు. 

అమృత్ పాల్ సహాయకుడు, ఖలిస్తాన్ లిబరేషన్ ఫోర్స్ చీఫ్ అవతార్ సింగ్ ఖండా మృతి.. ఏమైందంటే ?

‘‘ గత సోమవారం మాజీ మేయర్ ఘోడెలే ఇంటి కాంపౌండ్ గేట్ తెరిచి ఉంది. అదే రోజు రాత్రి, అతడి చెప్పులు ఇంటి ప్రధాన తలుపు దగ్గర నుంచి కనిపించకుండా పోయాయి. అయితే ఓ వీధి కుక్క కాంపౌండ్ వాల్ లోకి ప్రవేశించి పాదరక్షలను తీసుకువెళ్లినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.” అని పౌర అధికారి తెలిపారు. దీంతో ఆయన అధికారులకు ఫిర్యాదు చేశాడు.

4 చేతులు, 4 కాళ్లతో పుట్టిన శిశువు.. దేవుడి ప్రతిరూపం అంటూ పసికందును చూసేందుకు ఎగబడ్డ జనం.. ఎక్కడంటే ?

మరుసటి రోజు ఔరంగాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు చెందిన డాగ్ క్యాచింగ్ టీమ్‌ను పిలిపించి, వీధికుక్కలను పట్టుకోవడానికి ఆపరేషన్ ప్రారంభించారు. ఈ బృందం ఘోడేల్ నివసిస్తున్న ప్రాంతంలో నాలుగు వీధి కుక్కలను బంధించింది. అనంతరం ఈ కుక్కలకు వాసెక్టమీ శస్త్రచికిత్స నిర్వహించారు. అయితే దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి.

ప్రతిపక్షాల ఐక్యత వల్ల 2024 ఎన్నికల్లో ఎలాంటి లాభమూ ఉండదు - గులాం నబీ ఆజాద్

కాగా.. వీధి కుక్కల బెడదపై ఫిర్యాదులు అందినప్పుడల్లా కుక్కలను పట్టుకునేందుకు నగరపాలక సంస్థ బృందాలను పంపిస్తుందని, ఇది రొటీన్ ప్రక్రియ అని ఓ అధికారి తెలిపినట్టు ‘టైమ్స్ నౌ’ తెలిపింది. అయితే ఈ ఘటనపై వ్యాఖ్యానించడానికి ఘోడేల్ అందుబాటులో లేకుండా పోయారని పేర్కొంది.

PREV
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్