
ఖలిస్థాన్ వేర్పాటువాది అమృత్పాల్ సింగ్ ప్రధాన అనుచరుడు, ఖలిస్తాన్ లిబరేషన్ ఫోర్స్ (కేఎల్ఎఫ్) చీఫ్ అవతార్ సింగ్ ఖండా యూకేలో కన్నుమూశారు. మార్చి నుంచి ఏప్రిల్ మధ్య 37 రోజుల పాటు అమృత్ పాల్ సింగ్ పోలీసుల నుంచి తప్పించుకోవడానికి సహకరించిన ఖండాకు విషప్రయోగం జరిగినట్లు అనుమానిస్తున్నారు. అయితే ఆయన బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్నట్లు వైద్య రికార్డులు చెబుతున్నాయి. దీంతో ఆయనను బర్మింగ్ హామ్ లోని సిటీ హాస్పిటల్ లో చేర్పించారు.
'తిత్లీ ఉడి' పాడిన గొంతు ఇక లేదు.. ప్రముఖ సింగర్ శారద కన్నుమూత..
మార్చి 19న లండన్ లోని యూకే హైకమిషన్ ఎదుట జరిగిన నిరసనలో భారత పతాకాన్ని ఎగురవేయడం వెనుక బాంబు నిపుణుడైన ఖండా సూత్రధారిగా ఉన్నాడు. ఈ ఘటనకు సంబంధించి ఖండాతో పాటు మరో ముగ్గురు వేర్పాటువాదులను ప్రధాన నిందితులుగా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) గుర్తించింది. ఈ ఖండా.. హతమైన కేఎల్ ఎఫ్ ఉగ్రవాది కుల్వంత్ సింగ్ కుమారుడు. 2007లో స్టడీ వీసాపై యూకే వెళ్లిన ఆయన 2012లో అక్కడ ఆశ్రయం పొందారు.
2020 జనవరిలో పాకిస్తాన్ లో మాజీ చీఫ్ హర్మీత్ సింగ్ హత్య తర్వాత ఖండా 'రంజోధ్ సింగ్' అనే కోడ్ నేమ్ తో కేఎల్ఎఫ్ కు నేతృత్వం వహించినట్లు సమాచారం. దీప్ సిద్ధూ మరణానంతరం వారిస్ పంజాబ్ దే చీఫ్ గా అమృత్ పాల్ సింగ్ ను ఏర్పాటు చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారని భావిస్తున్నారు.
కాగా.. 37 రోజులుగా పరారీలో ఉన్న అమృత్ పాల్ సింగ్ ఏప్రిల్ 23న పంజాబ్ లోని మోగాలోని గురుద్వారాలో పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఆయనను అస్సాంలోని దిబ్రూగఢ్ జైలుకు తరలించారు, అక్కడ పాపల్ప్రీత్ సింగ్ తో సహా ఆయన ఎనిమిది మంది సహాయకులను జాతీయ భద్రతా చట్టం కింద ఉంచారు.