దృశ్యం సినిమా చూపించాడు.. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం చనిపోయినట్టుగా సీన్ క్రియేట్ చేసిన వ్యక్తి.. కానీ చివరికి

Published : Mar 16, 2023, 10:44 AM IST
దృశ్యం సినిమా చూపించాడు.. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం చనిపోయినట్టుగా సీన్ క్రియేట్ చేసిన వ్యక్తి.. కానీ చివరికి

సారాంశం

ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఓ వ్యక్తి తన కుటుంబంతో సహా చనిపోయినట్టు చిత్రీకరించాడు. ఈ క్రమంలో పలు సాక్షాలను కూడా రూపొందించాడు. అయితే చివరికి పోలీసులకు దొరికిపోయాడు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో చోటు చేసుకుంది. 

తెలుగులో మంచి హిట్ అయిన దృశ్యం సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. అందులో హీరో తన కుటుంబం పొరపాటున చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు, పోలీసులు, శిక్ష నుంచి తన వాళ్లను కాపాడేందుకు జరగనది జరిగినట్టుగా సీన్ క్రియేట్ చేస్తాడు. సాక్షాలను తయారు చేస్తాడు. అయితే అదంతా కల్పింతం. కానీ రియాలిటీగా ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వ్యక్తి కూడా ఆర్థిక సమస్యల నుంచి గట్టేందుకు కొంచెం అటూ ఇటూగా అలాంటి పనులే చేశాడు. కానీ చివరికి పోలీసులకు చిక్కాడు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే ? 

న‌డిరోడ్డుపై న‌గ్నంగా ప‌రుగులు.. చెట్టుకు క‌ట్టేసిన స్థానికులు.. అదుపులోకి తీసుకున్న పోలీసులు

అప్పుల బాధ నుంచి తప్పించుకునేందుకు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వ్యక్తి తన కుటుంబంతో సహా చనిపోయినట్టుగా సీన్ క్రియేట్ చేశాడు. సాక్షాలను రూపొందించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ డివిజన్‌లోని కాంకేర్ జిల్లాకు చెందిన 29 ఏళ్ల సమీరన్ వ్యాపారంలో తీవ్రంగా నష్టపోయాడు. దీంతో అప్పుల బాధ ఎక్కువైంది. అప్పులు తీర్చడానికి బీమా కంపెనీల నుంచి డెత్ క్లెయిమ్‌గా రూ. 72 లక్షలు పొందాలని ఆశించాడు. అందులోని రూ. 35 లక్షలను అప్పులు కట్టేయాలని భావించాడు.

దీని కోసం ఓ మంచి ప్లాన్ వేశాడు. అందులో భాగంగా మార్చి 1వ తేదీన కుటుంబంతో సహా కారులో ఇంటి నుంచి బయలుదేరాడు. తరువాత రాయ్ పూర్ కు వెళ్లాడు. అక్కడి నుంచి ధామ్‌తరి వద్దకు వచ్చి ఓ హోటల్ లో తన కుటుంబాన్ని ఉంచాడు. తరవాత కారు ను తీసుకొని చరమ వైపు బయలుదేరాడు. అక్కడ రోడ్డు పక్కన ఉన్న ఓ చెట్టును ఢీకొట్టించాడు. తరువాత తను తెచ్చుకున్న ఇంధనంతో కారును తగులబెట్టాడు. అందులో కుటుంబంతో సహా సజీవ దహనం అయినట్టు సీన్ క్రియేట్ చేశాడు. 

తరువాత అక్కడి నుంచి బస్ స్టాండ్‌కి నడిచి వెళ్లాడు. బస్సు ఎక్కి తిరిగి ధామ్‌తరీకి చేరుకున్నాడు. అక్కడి నుండి కుటుంబం మొత్తం బస్సుల్లో రాయ్‌పూర్‌తో పాటు ఇతర నగరాలకు బయలుదేరింది. అక్కడ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. తరువాత అలహాబాద్‌లో తాత్కాలిక నెంబర్, ఫోన్ నెంబర్ తీసుకున్నాడు. దీని ద్వారా అతడు ఎప్పటికప్పుడు తను క్రియేట్ చేసిన మరణంపై వార్తలు, పోలీసుల దర్యాప్తు వివరాలను తెలుసుకుంటూ ఉన్నాడు. 

త‌ల్లి చేతులు-కాళ్లు నీటి ట్యాంక్‌లో.. మొండెం-తలను అల్మారాలో దాచి.. మ‌రో షాకింగ్ ఘ‌ట‌నలో కూతురి అరెస్టు

అయితే కారు ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ ఘటనలో చనిపోయిన వారి వివరాలు సేకరించేందుకు దర్యాప్తు చేపట్టారు. సమీర్ కుటుంబ సభ్యుల ఫోన్ లను పోలీసులు ట్రేజ్ చేశారు. వారు సంచరిస్తున్న అయా ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు. చివరికి ఆ కుటుంబం చనిపోలేదని నిర్ధారించుకున్నారు. ఈ విషయం సమీరన్ కు కూడా తెలిసింది. మార్చి 13వ తేదీన ఇంటికి వచ్చాడు. దీంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. 

PREV
click me!

Recommended Stories

MICE పథకం.. ఈ రంగంలో గేమ్‌ చేంజర్
రైళ్లలో ఇకపై లగేజీకి ఛార్జీలు:Ashwini Vaishnaw on Indian Railway Luggage Rules | Asianet News Telugu