ఆదిత్య ఎల్1 లాంచింగ్ విజయవంతం.. ప్రకటించిన ఇస్రో.. శాస్త్రవేత్తలకు సోమనాథ్ అభినందనలు..

Published : Sep 02, 2023, 01:20 PM ISTUpdated : Sep 02, 2023, 01:23 PM IST
ఆదిత్య ఎల్1 లాంచింగ్ విజయవంతం.. ప్రకటించిన ఇస్రో.. శాస్త్రవేత్తలకు సోమనాథ్ అభినందనలు..

సారాంశం

సూర్యుడి రహస్యాలను కనుగొనేందుకు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) రూపొందించిన ఆదిత్య ఎల్‌-1 ఉపగ్రహం విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. 

సూర్యుడి రహస్యాలను కనుగొనేందుకు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) రూపొందించిన ఆదిత్య ఎల్‌-1 ఉపగ్రహం విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లాలోని శ్రీహరికోటలోని సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి శనివారం ఉదయం 11.50 గంటలకు పీఎస్ఎల్వీ సి57 వాహక నౌక నిప్పులు చిమ్ముతూ ఆదిత్య ఎల్‌-1 ఉపగ్రహాన్ని నింగిలోకి తీసుకెళ్లింది. ఆదిత్య-ఎల్1 ఉపగ్రహం లాంచింగ్ విజయవంతం అయినట్టుగా ఇస్రో ప్రకటించింది.  పీఎస్‌ఎల్‌వీ రాకెట్ నుంచి ఆదిత్య-ఎల్1 ఉపగ్రహం విజయవంతంగా వేరు చేయబడిందని ఇస్రో తెలిపింది. ఎల్ 1 పాయింట్ వద్దకు ఉపగ్రహం ప్రయాణాన్ని ప్రారంభించిందని పేర్కొంది. 

ఆదిత్య ఎల్-1 ఉపగ్రహాన్ని పీఎస్ఎల్వీ సి57 వాహక నౌక నిర్దేశిత కక్షలోకి ప్రవేశపెట్టిందని ఇస్రో వెల్లడించింది. దీంతో షార్‌లో శాస్త్రవేత్తలు సంబరాలు చేసుకున్నారు.  ఈ సందర్భంగా మాట్లాడిన ఇస్రో చైర్మన్ సోమనాథ్.. ఆదిత్య ఎల్1 లాంచింగ్ విజయవంతమైందని తెలిపారు. ఆదిత్య ఎల్1 కోసం పనిచేసిన శాస్త్రవేత్తలకు అభినందనలు చెప్పారు. ఆదిత్య ఎల్ 1 దాదాపు 125 రోజులు సుదీర్ఘంగా ప్రయాణించి.. ఎల్ 1 పాయింట్‌ను చేరుకుంటుందని.. ఆదిత్య ఎల్‌1కు ఆల్ ది బెస్ట్ చెప్పాలని అన్నారు. ఇక, కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ మాట్లాడుతూ.. ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. 

 

 

ఆదిత్య ఎల్-1 ప్రయోగం గురించి..
-సూర్యుడి పుట్టుక, అక్కడి వాతావరణంపై అధ్యయనం చేసేందుకు ఇస్రో ప్రయోగిస్తున్న మొదటి ఉపగ్రహం ఇదే.
-ఆదిత్య ఎల్ 1 ఉపగ్రహాన్ని భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని భూమి నుంచి సూర్యుడి దిశలో లాగ్రేంజ్‌ పాయింట్‌-1 (ఎల్‌-1) వద్ద ఉండే సుదీర్ఘమైన దీర్ఘ వృత్తాకార కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. 
-అక్కడి చేరేందుకు ఆదిత్య ఎల్-1 ఉపగ్రహానికి దాదాపు 125 రోజుల సమయం పడుతుంది. 
-ఈ ప్రదేశం నుంచి ఎలాంటి  అవరోధం లేకుండా సూర్యుడిని నిరంతరం అధ్యయనం చేసే  వీలు ఉంటుంది. 
-ఈ ఉపగ్రహం ద్వారా సౌర వ్యవస్థపై పరిశోధనలు జరపడంతో పాటు.. సౌర తుఫానులు, సూర్యుడి పుట్టుక, అక్కడి వాతావరణం, పరిస్థితులపై అధ్యయనం చేయాలనిఇస్రో చూస్తుంది. 
-ఇందు కోసం ఏడు పేలోడ్స్‌ను తీసుకెళ్తుండగా.. ఇవి సూర్యుడి పొరలైన ఫోటోస్పియర్‌, క్రోమోస్పియర్‌, సూర్యుడి బయటి పొర (కరోనా), సౌర రేణువులు, అయస్కాంత క్షేత్రాలను అధ్యయనం చేయనున్నాయి. తద్వారా సౌర తుఫానులు, అక్కడి వాతావరణం, పరిస్థితులపై అధ్యయనం చేయవచ్చు.

PREV
click me!

Recommended Stories

Nitin Nabin : బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మోదీ నమ్మిన బంటు.. ఎవరీ నితిన్ నబిన్?
Indian Railways : ఇండియన్ రైల్వే బంపర్ ఆఫర్.. తక్కువ ఖర్చుతో దేశమంతా తిరిగేయండిలా !