భార్యను దారుణంగా హత్య చేసిన భర్త.. జైలు నుంచి విడుదలైన రెండు రోజుల్లోనే.. ఎక్కడంటే ?

Published : Jan 08, 2023, 01:01 PM IST
భార్యను దారుణంగా హత్య చేసిన భర్త.. జైలు నుంచి విడుదలైన రెండు రోజుల్లోనే.. ఎక్కడంటే ?

సారాంశం

దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి జైలు నుంచి విడుదలైన రెండు రోజుల తరువాత తన భార్యను స్క్రూడ్రైవర్‌తో పొడిచి హత్య చేశాడు. తరువాత ఆమె ముక్కును కోశాడు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. 

ఓ భర్త తన భార్యను దారుణంగా హతమార్చిన ఘటన దేశ రాజధాని ఢిల్లీలో వెలుగులోకి వచ్చింది. నిందితుడు జైలు శిక్ష అనుభవించి, విడుదలైన రెండు రోజుల తరువాతే ఈ ఘటనకు పాల్పడటం గమనార్హం. ఈ ఘటన ఢిల్లీలో కలకలం రేకెత్తించింది.

బీజేపీ లీడ‌ర్, బెంగాల్ మాజీ గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠి కన్నుమూత‌.. ప్రధాని మోడీ స‌హా ప్ర‌ముఖుల నివాళి

నార్త్ వెస్ట్ ఢిల్లీలోని జహంగీర్‌పురికి చెందిన చేత్రామ్‌గా నిందితుడిని పోలీసులు గుర్తించారు. అతడు గతంలో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్ పీసీ) సెక్షన్ 107, 151 కింద జైలుకు వెళ్లి వచ్చాడు. అతడు జైలు నుంచి రెండు రోజుల కిందటే విడుదల అయ్యాడు. అయితే తన భార్యపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఆమెను హత్య చేశాడని పోలీసులు తెలిపారు. 

ఉత్తర భారతదేశంలో తగ్గని చలి తీవ్రత.. పొగ మంచు వల్ల ఢిల్లీలో 20 విమానాలు 42 రైళ్లు ఆలస్యం

భార్యను చంపేందుకు నిందితుడు స్క్రూడ్రైవర్‌ ను ఉపయోగించాడు. ఆమె చనిపోయేంత వరకు పొడుస్తూనే ఉన్నాడు. చనిపోయిన తరువాత బాధితురాలు ముక్కును కూడా కోసుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. 

మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది...

PREV
click me!

Recommended Stories

వందేమాతర గేయాన్ని సోనియా గాంధీ అడ్డుకున్నారా.? పంద్రాగ‌స్టు రోజు అస‌లేం జ‌రిగింది.?
అమర వీరులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఘన నివాళి |Droupadi Murmu Pays Homage at National War Memorial