
11 ఏళ్ల కిందట నమోదైన మహిళ మిస్సింగ్ కేసును పోలీసులు చేదించారు. ఆమె ఎక్కడికి వెళ్లిపోలేదని, హత్యకు గురయ్యిందని తేల్చారు. ఆమె భర్తే దారుణంగా ఆమెను చంపేశారని గుర్తించారు. ఈ ఘటన ఆ సమయంలో సంచలనం సృష్టించింది. అయితే ఇప్పుడు ఆ మిస్టరీని పోలీసులు బట్టబయలు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి.
కర్ణాటకలోని విజయపూర్ జిల్లా వాదావేన్ కు చెందిన టీచర్ పుచ్చప్ప, ప్రియాంక (19) అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. కొంత కాలం పాటు వీరి కాపురం చక్కగా సాగింది. అయితే భార్యకు ఓ దళిత యువకుడితో పరిచయం ఏర్పడింది. అది వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ విషయం భర్తకు తెలిసింది. ఇది తప్పని పలు మార్లు చెప్పాడు. అయినా ఆమె అలాగే వివాహేతర సంబంధం నడిపించింది. దీంతో భార్య ప్రియాంకను చంపాలని భర్త పుచ్చప్ప భావించాడు. దీని కోసం పక్కా ప్రణాళిక రచించాడు. దీనికి తన సోదరుడి సహాయం తీసుకున్నాడు.
అన్నాడీఎంకే పగ్గాలు దక్కించుకున్న పళనిస్వామి.. పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా నియామకం..
2011 జూలై 5వ తేదీన భార్య భర్తలు, భర్త సోదరుడు శ్రీశైలంలో దైవ దర్శనానికి వెళ్లి వస్తున్నారు. ఈ క్రమంలో ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల ప్రాంతానికి చేరుకోగానే ప్లాన్ ప్రకారం ప్రియాంక మెడకు తాడు బిగించి సోదరులు ఇద్దరూ కలిసి చంపేశారు. అనంతరం ఆమెను ఎవరూ గుర్తుపట్టకుండా చేసేందుకు.. మృతదేహంపై ఉన్న బట్టలను తొలగించారు. కేవలం లో దుస్తులతో రోడ్డు పక్కన పడేసి అక్కడి నుంచి బయలు దేరారు. అనంతరం సొంత రాష్ట్రానికి చేరుకున్నారు.
ఈ మర్డర్ విషయం ప్రియాంక తల్లిదండ్రులకు తెలిసింది. అయినా అప్పటికే తమ బిడ్డ ప్రవర్తనతో విసిగిపోయి ఉన్నారు. కాబట్టి పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. అయితే ఇరుగుపొరుగు వారు పుచ్చప్పను ప్రశ్నించగా.. ఆమె ఎవరితోనే వెళ్లిపోయిందని బదులిచ్చేవాడు. దీనిపై పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసకున్నాడు. విచారణ చేపట్టిని ఆమె కనిపించలేదు. దీంతో ఆ కేసు అలాగే ఉండిపోయింది.
ఈ మర్డర్ మిస్టరీ అందరికీ తెలిసినా సైలెంట్ గానే ఉన్నారు. అయితే ఇటీవల పుచ్చప్పకు, అతడి బంధువులకు ఆస్తి వివాదాలు నెలకొన్నాయి. దీంతో వారు పోలీసులకు వెళ్లి అసలు విషయం చెప్పారు. దీంతో ఈ ఘటన ఒక్క సారిగా వెలుగులోకి వచ్చింది. మిస్సింగ్ కేసు ను తిరిగి ఓపెన్ చేశారు. సాక్షాలను పరిశీలించారు. దీంతో పుచ్చప్ప, అతడి సోదరుడిపై కేసు నమోదు చేశారు.